Share News

Chennai: తీరప్రాంతానికి కొట్టుకువచ్చిన తాబేళ్ల కళేబరాలు

ABN , Publish Date - Jan 14 , 2025 | 01:28 PM

నగరంలోని సముద్ర తీరప్రాంతాలకు ఒక్కొక్కటిగా 37 తాబేళ్ల కళేబరాలు కొట్టుకురావడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెమ్మేలి కుప్పం(Nemmeli kuppam) తీర ప్రాంతంలో సుమారు కి.మీ వరకు 20 తాబేళ్లు మృతిచెంది తీరానికి కొట్టుకొచ్చాయి.

Chennai: తీరప్రాంతానికి కొట్టుకువచ్చిన తాబేళ్ల కళేబరాలు

చెన్నై: నగరంలోని సముద్ర తీరప్రాంతాలకు ఒక్కొక్కటిగా 37 తాబేళ్ల కళేబరాలు కొట్టుకురావడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెమ్మేలి కుప్పం(Nemmeli kuppam) తీర ప్రాంతంలో సుమారు కి.మీ వరకు 20 తాబేళ్లు మృతిచెంది తీరానికి కొట్టుకొచ్చాయి. అలాగే, ఇంజంబాక్కం ప్రాంతంలోనూ 8 తాబేళ్ల కళేబరాలను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో అప్పుడప్పుడు తాబేళ్ల కళేబరాలు కనిపిస్తున్న నేపథ్యంలో, కొద్దిరోజులుగా ఎక్కువ కావడంపై కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Former minister: విద్వేషాలకు ప్రభుత్వ వైఖరే కారణం


nani4.jpg

నెమ్మేలికుప్పం(Nemmeli kuppam) ప్రాంతంలో నిర్లవణీకరణ కేంద్రం పనుల కోసం ఏర్పాటుచేసిన దిమ్మెల వల్ల తాబేళ్లు మృతిచెంది ఉంటాయని అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. జాలర్ల వలలో చిక్కుకొని కూడా తాబేళ్లు మృతిచెంది ఉండొచ్చని, అటవీ శాఖ సిబ్బంది ఈ విషయమై జాలర్ల తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.


ఈవార్తను కూడా చదవండి: గాలిపటం ఎగురవేస్తూ విద్యుదాఘాతంతో బాలుడి మృతి

ఈవార్తను కూడా చదవండి: పండుగ నాడు... పోషక శోభ

ఈవార్తను కూడా చదవండి: MLC K Kavitha: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత

ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 14 , 2025 | 01:28 PM