Share News

Karnataka Caste Census: కర్ణాటకలో కులగణన సర్వేపై ప్రతిష్టంభన

ABN , Publish Date - Apr 18 , 2025 | 03:11 AM

కర్ణాటక కులగణన సర్వే నివేదికపై మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తాయి ఈ నేపధ్యంలో సీఎం సిద్దరామయ్య ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్‌ భేటీ అర్ధంతరంగా ముగిసింది

Karnataka Caste Census: కర్ణాటకలో కులగణన సర్వేపై ప్రతిష్టంభన

  • మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు

  • అర్ధంతరంగా ముగిసిన క్యాబినెట్‌ భేటీ

బెంగళూరు, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో కులగణన సర్వే నివేదికపై ప్రతిష్టంభన నెలకొంది. విద్య, సామాజిక, ఆర్థిక అంశాలపై బీసీ కమిషన్‌ సమర్పించిన నివేదికపై ఏటూ తేల్చకుండానే గురువారం సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో కు లగణన నివేదికలోని అంశాలపై మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కూడా నివేదికను అంగీకరించలేమని తేల్చిచెప్పినట్లు తెలిసింది. దీంతో క్యాబినెట్‌ భేటీ అనంతరం విధానసౌద నుంచి బయటకు వచ్చే సమయంలో సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడేందుకు సుముఖత చూపలేదు. మరోసారి చర్చిస్తామని చెప్పి వెళ్లిపోయారు.


వచ్చే క్యాబినెట్‌ భేటీలోనూ తీర్మానం జరగకపోవచ్చని, మరో రెండు మూడు సమావేశాలు జరగవచ్చని మంత్రులు ఎంబీ పాటిల్‌, రాజణ్ణ, చలువరాయస్వామి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. భేటీలో నివేదిక వివరాలను సిద్దరామయ్య తన సహచర మంత్రులకు వివరించారు. గత వారం రోజుల్లో నివేదికపై ఎంతమేర అవగాహన పొందారని ప్రశ్నించారు. అంతలోనే మంత్రు లు తలోమాట మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. దీంతో కాసేపు వినాలని సీఎం వారిని కోరారు. నివేదికపై కొందరు మంత్రులు మద్దతుగా, మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడినట్లు తెలిసింది. దీంతో సమగ్ర చర్చ లేకుండా, మంత్రులందరూ అభిప్రాయాలు వ్యక్తం చేయకుండానే క్యాబినెట్‌ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు.


ఈ వార్తలు కూడా చదవండి

తరగతి గదిలో పెచ్చులూడి పడి..

ప్రైవేట్‌ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది

దుబాయిలో అసలేం జరిగింది..?

తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 18 , 2025 | 03:12 AM