Share News

MCD Elections: ఎంసీడీ ఎన్నికలకు ముందు స్పీకర్ కీలక నిర్ణయం

ABN , Publish Date - Mar 22 , 2025 | 03:43 PM

ఎంసీడీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వేటు వేసే హక్కును ఈ నామినేటెడ్ ఎమ్మెల్యేలు కలిగి ఉంటారు. దీంతో బీజేపీ గెలుపు అవకాశాలు మరింత మెరుగుపడే వీలుంది.

MCD Elections: ఎంసీడీ ఎన్నికలకు ముందు స్పీకర్ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD)కి 2025-26 సంవత్సరానికి గాను 14 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా నామినేట్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ మేయర్ ఎన్నికలు (Mayoral Elections) ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగాల్సి ఉన్న నేపథ్యంలో స్పీకర్ తాజా నియామకాలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. మున్సిపల్ స్థాయిలోనూ బీజేపీ గెలిస్తే 'ట్రిపుల్ ఇంజన్' ప్రభుత్వం బీజేపీ ఏలుబడిలోకి వస్తోంది. ఎంసీడీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వేటు వేసే హక్కును ఈ నామినేటెడ్ ఎమ్మెల్యేలు కలిగి ఉంటారు. దీంతో బీజేపీ గెలుపు అవకాశాలు మరింత మెరుగుపడే వీలుంది.

JAC Meet Delimitation: డీలిమిటేషన్‌పై హైదరాబాద్‌లో జేఏసీ తదుపరి భేటీ


ఎంసీడీ బడ్జెట్ రూపకల్పన, సివిక్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ గవర్నెన్స్‌ను మెరుగుపరచేందుకు ఎమ్మెల్యేలను నామినేట్ చేస్తున్నట్టు స్పీకర్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. కార్పొరేషన్ పనితీరు, పారిశుద్ధం, మౌలిక వసతులు, మెరుగైన ప్రజాసేవలకు నామినేట్ ఎమ్మెల్యేలు సహకరిస్తారని పేర్కొన్నారు.


ఆప్ నుంచి ముగ్గురు

ఎంసీడీకి స్పీకర్ నామినేట్ చేసిన ఎమ్మెల్యేలలో అనిల్ కుమార్ శర్మ (ఆర్కే పురం), చంద్ర కుమార్ చౌదరి (సంగం విహార్), జితేందర్ మహాజన్ (రోహటస్ నగర్), కర్నైల్ సింగ్ (షాకూర్ బస్తీ), మనోజ్ కుమార్ షోకీన్ (నాంగ్లోయ్), నీలం పహల్వాన్ (నజఫ్‌గఢ్), ప్రద్యుమ్న్ సింగ్ రాజ్‌పుట్ (ద్వారక), పర్వేష్ రత్న్ (పటేల్ నగర్), రాజ్ కుమార్ భాటియా (ఆదర్శ్ నగర్), రామ్ సింగ్ నేతాజీ (బదర్‌పూర్), రవికాంత్ (త్రిలోక్‌పురి), సంజయ్ గోయల్ (సహ్‌దర), తర్వీందర్ సింగ్ మార్వా (జాంగ్‌పుర) ఉన్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యేలలో పర్వేష్ రత్న్, సురేంద్ర కుమార్, రామ్ సింగ్ నేతాజీలు ఆప్ ఎమ్మెల్యేలు కాగా, తక్కినవారు బీజేపీ ఎమ్మెల్యేలు. కాగా, 2024 నవంబర్‌లో జరిగిన మేయర్ ఎన్నికల్లో కేవలం 3 ఓట్ల తేడాతో బీజేపీని ఆప్ ఓడించింది.


ఇవి కూడా చదవండి..

Chennai: మాజీసీఎం ఘాటు సమాధానం.. మీ పార్టీని తన్నుకుపోతారు

MLA: ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..

Read Latest and National News

Updated Date - Mar 22 , 2025 | 03:43 PM