Share News

Population Decline: ఒకసారి జనాభా తగ్గుదల మొదలైతే దాన్ని అడ్డుకోవడం కష్టం.. జోహో సీఈఓ హెచ్చరిక

ABN , Publish Date - Jan 05 , 2025 | 04:17 PM

జనాభా తగ్గుదలపై జోహో సంస్థ సీఈఓ శ్రీధర్ వెంబు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. చైనా, జపాన్‌లో పరిస్థితులను ఉదహరించిన ఆయన ఒక్కసారి జనాభా తగ్గుదల మొదలైతే దాన్ని ఆపడం కష్టమని హెచ్చరించారు.

Population Decline: ఒకసారి జనాభా తగ్గుదల మొదలైతే దాన్ని అడ్డుకోవడం కష్టం.. జోహో సీఈఓ హెచ్చరిక

ఇంటర్నెట్ డెస్క్: జనాభా తగ్గుదల ఒక్కసారి మొదలైతే పరిస్థితిని చక్కదిద్దడం చాలా కష్టమని జోహో కార్పొరేషన్ సంస్థ సీఈఓ శ్రీధర్ వెంబు తాజాగా హెచ్చరించారు. చైనా, జపాన్‌లోని పరిస్థితులను ఇందుకు తాజా ఉదాహరణగా పేర్కొన్నారు. ‘‘1990ల్లో జపాన్ సాంకేతికంగా ఉచ్ఛస్థితికి చేరుకుంది. అమెరికాను కూడా చైనా మించిపోనుందని అప్పట్లో జనాలు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడేమైందీ.. అక్కడి జనాభా తగ్గిపోవడంతో కొత్త సమస్యలు ప్రారంభమవుతున్నాయి’’ అని ఆయన తాజాగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం చైనాలో కూడా దాదాపు ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని అన్నారు (Population).

Gujarat Helicopter Crash: కూలిన హెలికాఫ్టర్.. ఎంతమంది చనిపోయారంటే


దేశాల్లో పారిశ్రామీకరణ, నగరీకరణ జరుగుతున్న తీసుకునే నిర్ణయాలు, సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతుండటం, చిన్న కుటుంబాల సంఖ్య పెరగడం తదితరాలు జనాభా తగ్గుదలకు దారి తీస్తాయని శ్రీధర్ వెంబు చెప్పారు. ‘‘ఒక్కసారి జనాభా తగ్గుదల మొదలైతే దాన్ని అడ్డుకోవడం చాలా కష్టం. నాకు తెలిసి ఈ పరిస్థితి అడ్డుకున్న దేశం ఒక్కటి కూడా లేదు. అందుకే నేను గ్రామీణ జీవనానికి, మన సంప్రదాయాలవైపు మొగ్గు చూపుతాను’’ అని ఆయన అన్నారు. జంటలను పిల్లల్ని కనేలా ప్రోత్సహించే అభివృద్ధి విధానాలకే తన మద్దతు అని స్పష్టం చేశారు. మిగతావేటికీ ఇంత ప్రాముఖ్యత లేదని స్పష్టం చేశారు.

Union Minister: జేడీఎస్‌ నిర్వీర్యానికే.. ఆపరేషన్‌ హస్త కుట్ర


భారత జనాభాలో మార్పులపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో జోహో సీఈఓ వ్యాఖ్యలు మరోసారి నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చాయి. జనాభా స్థిరీకరణకు సంతానోత్పత్తి రేటు 2.1 కాగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ రేటు 1.6కి చేరుకుంది. దీంతో, జనాభాలో వృద్ధుల సంఖ్య పెరిగి దేశంపై భారం పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

గతేడాది నవంబర్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభా తగ్గుదలతో ప్రమాదాలపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జనాభాలో ప్రతికూల మార్పులను అడ్డుకునేందుకు తక్షణ చర్యలు అవసరమని ఆయన పిలుపునిచ్చారు.

Read Latest and National News

Updated Date - Jan 05 , 2025 | 04:19 PM