Rahul Gandhi: సభలో నన్ను మాట్లాడనీయడం లేదు: స్పీకర్‌పై రాహుల్ తీవ్ర ఆరోపణ
ABN , Publish Date - Mar 26 , 2025 | 04:12 PM
పార్లమెంటు వెలుపల మీడియాతో బుధవారంనాడు ఆయన మాట్లాడుతూ, అసలేం జరుగుతోందో అర్ధం కావడం లేదని, మాట్లాడేందుకు అవకాశం ఇమ్మని ఆయనను (స్పీకర్) కోరుతున్నప్పటికీ అనుమతించడం లేదని చెప్పారు. ఇది సభ నడిపే పద్ధతి కాదన్నారు.

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తనను సభలో మాట్లాడేందుకు అనుమతించడం లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. సభా కార్యక్రమాలు అప్రజ్వామిక విధానంలో సాగుతున్నాయని, కీలక అంశాలను ప్రస్తావించేందుకు తాను పదేపదే విజ్ఞప్తి చేస్తు్న్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. పార్లమెంటు వెలుపల మీడియాతో బుధవారంనాడు ఆయన మాట్లాడుతూ, అసలేం జరుగుతోందో అర్ధం కావడం లేదని, మాట్లాడేందుకు అవకాశం ఇమ్మని ఆయనను (స్పీకర్) కోరుతున్నప్పటికీ అనుమతించడం లేదని చెప్పారు. ఇది సభ నడిపే పద్ధతి కాదన్నారు.
Rana Sanga Row: రాణా సంగపై వ్యాఖ్యలు.. సమాజ్‌వాదీ ఎంపీ నివాసంపై కర్ణిసేన దాడి
మహాకుంభమేళా గురించి ఇటీవల ప్రధాని మాట్లాడినప్పుడు తాను నిరుద్యోగం గురించి మాట్లాడాలనుకున్నాననీ, కానీ పదేపదే అడ్డుకట్ట వేశారని రాహుల్ వాపోయారు. ''నేనేమీ చేయలేక కూర్చుండి పోయాను. ఇప్పటికీ నేను మాట్లాడేందుకు ఎప్పడు లేచి నిలబడినా మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యానికి చోటు లేదు" అని అన్నారు.
నిబంధనలు పాటించండి..
దీనికి ముందు, బుధవారం సభా కార్యక్రమాల సమయంలో స్పీకర్ ఓంబిర్లా రాహుల్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, సభ గౌరవాన్ని కాపాడేందుకు నిబంధనలను పాటించాలని సూచించారు. సభ్యుల ప్రవర్తన సభా ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం లేదని పలుమార్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ సభలో తండ్రీకూతురు, తల్లీ కుమార్తె, భార్యాభర్తలు సభ్యులుగా ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రతిపక్ష నేత 394 నిబంధన ప్రకారం నడుచుకుంటారని అశిస్తున్నానని అన్నారు. కాగా, స్పీకర్ ఏ సందర్భంలో ఈ సూచన చేశారనది మాత్రం వెంటనే తెలియలేదు.
స్పీకర్‌కు సమాధానం ఇచ్చేలోపే..
కాగా, స్పీకర్ తన గురించి వ్యాఖ్యలు చేసి దానిపై మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వకుండానే సభను వాయిదా వేశారని రాహుల్ గాంధీ తెలిపారు. గత వారం కూడా తనకు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వలేదని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడికి సభలో ప్రసంగించే అవకాశం ఇవ్వడం సంప్రదాయని గుర్తు చేసారు.
ఇవి కూడా చదవండి..