Stolen Smartphones: రైల్లో మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా, వెంటనే ఇలా చేయండి.. సరికొత్త సౌకర్యం..
ABN , Publish Date - Apr 04 , 2025 | 06:10 PM
మీరు రైలులో ప్రయాణిస్తున్న క్రమంలో అనుకోకుండా మీ ఫోన్ పోయిందా, అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇలాంటి విషయంలో టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కలిసి కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఏం చేయాలో తెలియక
అనేక మంది రైళ్లలో ప్రయాణిస్తున్న క్రమంలో అప్పుడప్పుడు వారి ఫోన్లు చోరీకి గురవుతుంటాయి. మరికొన్ని సార్లు పలువురు దుండగులు మాటు వేసి మరి ఆయా ఫోన్లను ఎత్తుకెళ్తుంటారు. దీంతో బాధితులు ఏం చేయాలో తెలియక ఉండిపోతారు. మరికొంత మంది మాత్రం పోలీసులకు తెలుపుతారు. అయితే ఇలాంటి చర్యలకు చెక్ పెట్టేందుకు టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కలిసి కీలక నిర్ణయం తీసుకున్నాయి.
పోగొట్టుకున్న ఫోన్‌లను
ఈ క్రమంలో రైలు ప్రయాణంలో లేదా రైల్వే స్టేషన్‌లో మీ ఫోన్ పోగొట్టుకున్నా, దొంగిలించబడినా మీకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), DoT సాంకేతిక సహకారం అందిస్తుంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా మీరు త్వరగా మీ ఫోన్‌ను ట్రాక్ చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఈ చర్యను అమలు చేయడంలో DoT, RPFతో కలిసి పని చేస్తాయి. ఈ విధానం ద్వారా మీరు మీ ఫోన్‌ను తిరిగి పొందడానికి లేదా దాన్ని బ్లాక్ చేయడానికి మరింత సులభతరమైన ప్రక్రియను పొందుతారు. అదే సమయంలో మీ రవాణా వ్యవస్థలో పోగొట్టుకున్న ఫోన్‌లను గుర్తించడాన్ని మరింత సులభతరం చేస్తుంది.
ఈజీగా బ్లాక్
ప్రస్తుతం టెలికమ్యూనికేషన్స్ విభాగం ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ద్వారా మీరు మీ పోగొట్టుకున్న ఫోన్‌లను చాలా సులభంగా బ్లాక్ చేయవచ్చు. ఈ సిస్టమ్ ద్వారా, మీరు మీ ఫోన్ గుర్తింపు సంఖ్య (IMEI)ను నమోదు చేసి, దానిని ట్రాక్ చేయవచ్చు. ఈ పోర్టల్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు మీ ఫోన్‌ను కేవలం బ్లాక్ చేయడమే కాకుండా, దొంగిలించబడిన పరికరాన్ని వెతకడంలో కూడా సహాయం పొందవచ్చు. ఈ విధంగా ఈ కొత్త సౌకర్యం ప్రయాణికులకు రక్షణ కవచంగా పనిచేస్తుంది.
DoT తాజా ప్రకటన
టెలికమ్యూనికేషన్స్ విభాగం ఇటీవల ఈ ప్రయోజనాలను సోషల్ మీడియా X ప్లాట్‌ఫాం ద్వారా ప్రకటించింది. ఈ ప్రకటనలో రైల్వే స్టేషన్లలో లేదా రైళ్లలో స్మార్ట్‌ఫోన్‌లు పోయినా లేదా దొంగిలించబడినా, వాటిని RPF కమ్యూనికేషన్ యాప్ ద్వారా గుర్తించవచ్చని వెల్లడించింది. అయితే మీరు ఫోన్‌ను తిరిగి పొందలేకపోతే, దాన్ని ఆన్‌లైన్ ద్వారా బ్లాక్ చేయడం కూడా సాధ్యమవుతుంది.
ఈ విధంగా DoT, RPF.. టక్నాలజీని ఉపయోగించి ప్రజలకు మరిన్ని పరిష్కార మార్గాలను అందించడం పట్ల నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టెలికమ్యూనికేషన్స్ శాఖ సంచార్ సాథీ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ వినియోగదారులకు మరెన్నో ఉపయోగకరమైన సేవలను అందిస్తుంది. ఈ యాప్‌ను ఉపయోగించి, మీరు పోగొట్టుకున్న ఫోన్‌లను బ్లాక్ చేయవచ్చు. అదేవిధంగా ఈ యాప్ ద్వారా మీ పేరులో నమోదైన యాక్టివ్ నంబర్‌ల గురించి కూడా తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Credit Score: క్రెడిట్ కార్డు లేకున్నా క్రెడిట్ స్కోర్ పెంచుకునే చిట్కాలు..ఇలా మరింత ఈజీ..
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News