Hyderabad: వృద్ధురాలైన అత్తపై కోడలి దాష్టీకం
ABN , Publish Date - Apr 23 , 2025 | 11:03 AM
ప్రతి ఒక్కరిని కలిచివేసే సంఘటన ఇది. వృద్ధాప్యంలో ఉన్న అత్తపై ఓ కోడలు తన దాష్టీకాన్ని ప్రదర్శించిన సంఘటన నగరంలో చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసిన పలువురు కోడలిపై శాపనార్ధాలు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్: వృద్ధాప్యంలోని అత్తపై కోడలు దాష్టీకాన్ని ప్రదర్శించింది. భార్య ఆర్తనా దాలు విన్నా ఏమీ చేయలేని స్థితిలో అంధుడైన భర్త. ఈ ఘటన నాగోల్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... నాగోల్ బండ్లగూడలోని మధురానగర్ కాలనీ(Mathuranagar Colony)లో నివాసముం టున్న పసుపులేటి సంతోష్‌రెడ్డి, రాములమ్మ(80), భార్యాభర్తలు. వారి పెద్దకుమారుడు పసుపులేటి వేణుగోపాల్‌రెడ్డికి అతడి భార్య సంధ్యారాణికి గొడవలు జరిగి ఐదేళ్ల నుంచి వేరుగా ఉంటున్నారు. ఇరువురు ఆస్తి విషయంలో కోర్టులో కేసు వేయగా, ఆ కేసు కోర్టులో నడుస్తోంది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కుమార్తెకు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేకే భర్తను చంపేసింది
తనను అత్తింటి వారు ఇంట్లోకి రానివ్వడం లేదంటూ సంధ్యారాణి కోర్టును ఆశ్రయుంచగా ఇంట్లోకి వెళ్లొచ్చంటూ ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ కాపీనీ తీసుకుని సంధ్యారాణి ఈ నెల 18న బంధువులు అమరేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, యాదవరెడ్డి, నర్సిరెడ్డి, వెంకటేశ్వర్‌రావు ను వెంటబెట్టుకుని ఇంటికి వెళ్లింది. కోర్టు ఆర్డర్ చూసిన సంధ్యారాణి అత్తమామలు అడ్రస్ వేరుగా ఉందని వెళ్లి పోమన్నారు. ఆగ్రహించిన కోడలు సంధ్యారాణి.. అత్త రాములమ్మపై దాడి చేయగా, మెడ, నడుము భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో సమీపం లోని ఆస్పత్రిలోచికిత్స పొందుతోంది.
నాగోల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళితే వారు పట్టించుకోక పోవడంతో, కోడలు తమపై దాడి చేసిన సీసీ ఫుటేజీ ఆధారంతో ఎల్బీనగర్ ఏసీపీకి ఫిర్యాదు అందజేశారు. ఏసీపీ కృష్ణయ్య కేసు నమోదు చేయాలని నాగోల్ పోలీసులను ఆదేశిం చారు. అయితే నాగోల్ ఇన్‌స్పెక్టర్ ఏసీపీ ఎందుకు ఫిర్యాదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని వృద్ధ దంపతులు ఆవేదన చెందారు. ఈ విషయమై నాగోల్ ఇన్‌స్పెక్టర్ సూర్యనాయక్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. కేసు కోర్టులో ఉన్నందున తాము కల్పించుకోబోమని, కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్టీసీలో సమ్మెకు సై...జేఏసీకి సంఘాల మద్దతు
Singareni: సింగరేణి ఉపకార వేతనం
Read Latest Telangana News and National News