Metro Rail Tracks: ప్రపంచంలోనే తొలిసారి ఒకే స్తంభంపై ఐదు మెట్రోరైలు పట్టాలు
ABN , Publish Date - Feb 01 , 2025 | 12:11 PM
చెన్నై మెట్రోరైల్వే సంస్థ నగరంలో ప్రస్తుతం నిర్మిస్తున్న రెండో దశ మెట్రోరైలు మార్గాల ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఒకే స్తంభంపై ఐదు డబుల్ లేయర్డ్ ట్రాక్‌లను నిర్మించనుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ రైల్వే ట్రాక్‌ల నిర్మాణం చేపడుతున్న ఘనత తమ సంస్థకే దక్కుతుందని సీఎంఆర్‌ఎల్ డైరెక్టర్ అర్జునన్ తెలిపారు.

చెన్నై: చెన్నై మెట్రోరైల్వే సంస్థ(Chennai Metro Railway Company) నగరంలో ప్రస్తుతం నిర్మిస్తున్న రెండో దశ మెట్రోరైలు మార్గాల ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఒకే స్తంభంపై ఐదు డబుల్ లేయర్డ్ ట్రాక్‌లను నిర్మించనుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ రైల్వే ట్రాక్‌ల నిర్మాణం చేపడుతున్న ఘనత తమ సంస్థకే దక్కుతుందని సీఎంఆర్‌ఎల్ డైరెక్టర్ అర్జునన్(CMRL Director Arjunan) తెలిపారు. వడపళని ఆర్కాట్‌రోడ్డు ప్రాంతంలో ఈ ఐదు రైలు పట్టాలను నిర్మించడానికి సొరంగాలను నిర్మించాలని ప్రణాళిక రూపొందించామని, దీని అమలుకు రూ.5వేల కోట్లు ఖర్చవుతుందని భావించి, ఈ అదనపు వ్యయభారాన్ని నివారించడానికి ఒకే స్తంభంపై ఐదు డబుల్ లేయర్ల ట్రాక్‌లను నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఈ వార్తను కూడా చదవండి: Kisan Credit Cards: రైతులకు గుడ్ న్యూస్.. కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితి పెంపు
ఈ వినూత్న విధానం ద్వారా రూ.5వేల కోట్లను ఆదా అవుతుందన్నారు. ఐదు ట్రాక్‌ల బరువు తట్టుకునేలా భూమిలో గట్టి పునాది వేస్తున్నామని, వడపళని నుండి పోరూరు వరకు ఉన్న 4 కిలోమీటర్ల మేర ఐదు ట్రాక్‌లను డబుల్ లేయర్లలో నిర్మిస్తామని, రెండంతస్థుల్లో దిగువ అంతస్థులో రెండు ట్రాక్‌లపై, పై అంతస్థులో మరో రెండు ట్రాక్‌లను నిర్మించి, వాటి పక్కనే మరో లూప్‌లైన్ ట్రాక్ కూడా నిర్మించనున్నామని చెప్పారు. దీంతో నాలుగు రైళ్లను ఒకే స్తంభంపై నడపటానికి వీలు కలుగుతుందన్నారు. రైళ్ల ట్రాక్‌లను మార్చడానికి లూప్‌లైన్ సాయపడుతుందన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Budget 2025: బడ్జెట్ 2025.. వచ్చే వారం ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు..
ఈవార్తను కూడా చదవండి: Financial Survey: పన్ను వసూళ్లలో తెలంగాణ నం.1
ఈవార్తను కూడా చదవండి: ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మహిళల అదృశ్యం!
ఈవార్తను కూడా చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: ఏకంగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్‌చల్
Read Latest Telangana News and National News