Share News

Former CM: ఎవరా సార్‌.. అంత వణుకెందుకు..

ABN , Publish Date - Jan 01 , 2025 | 10:10 AM

అన్నా విశ్వవిద్యాయలంలో ఓ విద్యార్థినిపై జరిగిన లైంగికదాడి కేసులో కీలక వ్యక్తిని కాపాడేందుకు డీఎంకే మంత్రులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని, ఆ సార్‌ ఎవరని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) ప్రశ్నించారు.

Former CM: ఎవరా సార్‌.. అంత వణుకెందుకు..

  • డీఎంకే నేతలను ప్రశ్నించిన ఈపీఎస్‌

చెన్నై: అన్నా విశ్వవిద్యాయలంలో ఓ విద్యార్థినిపై జరిగిన లైంగికదాడి కేసులో కీలక వ్యక్తిని కాపాడేందుకు డీఎంకే మంత్రులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని, ఆ సార్‌ ఎవరని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) ప్రశ్నించారు. రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అత్యాచార కేసులో అనేక సందేహాలను లేవనెత్తారు.

ఈ వార్తను కూడా చదవండి: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో 4.9 కిలోల గంజాయి పట్టివేత


అదేసమయంలో పొల్లాచ్చి అత్యాచారఘటనపై డీఎంకే మం త్రులు చేస్తున్న ప్రచారాన్ని కూడా ఈపీఎస్‌ తిప్పికొట్టారు. విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు. ముఖ్యంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమే సుమోటాగా ఈ కేసును విచారణకు స్వీకరించి కీలక తీర్పుఇచ్చిందని, ఇందులో ముగ్గురు సీనియర్‌ మహిళా పోలీస్‌ ఉన్నతాధికారులు ఈ కేసు విచారించాలని ఆదేశించిందని గుర్తు చేశారు.


సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలో బాధితురాలి ఫోన్‌ నంబరు కూడా ఉందన్నారు. బాధితురాలి వాంగ్మూలంలో ‘ఆ సార్‌ కూడా కొద్దిసేపు ఉండు’ అని అన్నారని చెప్పినట్టుగా ఉందన్నారు. ఇపుడు ప్రజలతో కలిసి తాము కూడా ఆ సార్‌ ఎవరు అని అడుగుతున్నామన్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని, దోషులను కఠినంగా శిక్షించాలన్నఏకైక డిమాండ్‌తో పోరాటం చేస్తున్నామన్నారు. అయితే, ఆసార్‌ను రక్షించేందుకు డీఎంకేమంత్రులు, నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు.


అందుకే డీఎంకే నేతలు వణికిపోతూ తమపై ఎదురుదాడికి దిగుతున్నారని ఆరోపించారు. ఈ కేసులో ఉన్నత విద్య, న్యాయ, సంక్షేమ శాఖామంత్రులు నోటికి పనిచెప్పడానికి కారణం ఏంటి? అని ఈపీఎస్‌ ప్రశ్నించారు. అదేసమయంలో తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పొల్లాచ్చి అత్యాచార కేసును డీఎంకే నేతలు ప్రస్తావిస్తున్నారని, నిజానికి ఈ ఘటన వెలుగులోకి వచ్చిన మరుక్షణమే తాము సీబీఐ విచారణకు ఆదేశించామని ఎడప్పాడి గుర్తు చేశారు. కానీ, డీఎంకే పాలనలో మహిళలకు, విద్యార్థినిలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.


ఈవార్తను కూడా చదవండి: రైళ్ల వేళల్లో మార్పులు

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 24,905

ఈవార్తను కూడా చదవండి: సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 01 , 2025 | 10:10 AM