Share News

Nirmala Sitaraman: కేంద్రం సంచలనం.. ఇక మీ మెసెజ్‌లు అన్నీ చదివేస్తారు

ABN , Publish Date - Mar 28 , 2025 | 05:19 PM

Nirmala Sitaraman: కొత్త ఆర్థిక సంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను 2025 బిల్లు గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Nirmala Sitaraman: కేంద్రం సంచలనం.. ఇక మీ మెసెజ్‌లు అన్నీ చదివేస్తారు
Finance Minister Nirmala sitaraman

న్యూఢిల్లీ, మార్చి 28: మరికొద్ది రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. అలాంటి వేళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. మీ అకౌంట్ ఖాతాలకు వాట్సప్, ఈ మెయిల్‌తోపాటు టెలిగ్రాఫ్‌ను యాక్సెస్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే వాటిని ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఓ కంట కనిపెడతారని చెప్పారు. ఆదాయపు పన్ను బిల్లు -2025ను అనుసరించి ఈ తరహా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

గురువారం లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ.. ఈ కొత్త బిల్లు వల్ల కొత్త సాంకేతికతతో పన్ను అమలుకు సంబంధించని వివరాలను ఆమె వివరించారు. క్రిప్టోకరెన్సీ వంటి వర్చువల్ ఆస్తులు విస్మరించబడకుండా చూసుకోవడానికి ఇది సహాయపడుతుందన్నారు. డిజిటల్ ఖాతాల నుండి వచ్చే ఆధారాలను అధికారులు కోర్టులో పన్ను ఎగవేతను నిరూపించడంతోపాటు పన్ను ఎగవేత ఖచ్చితమైన మొత్తాన్ని లెక్కించడానికి ఈ ఆధారాలను అందిస్తాయన్నారు.


ఈ బిల్లును ప్రభుత్వం ఎందుకు తీసుకువచ్చిందంటే..?

ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో ఆదాయపు పన్ను బిల్లు -2025ను కేంద్రం తీసుకు వచ్చిందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వం లెక్కల్లో చూపని నగదు, చట్టవిరుద్ద కార్యకలాపాలను గుర్తించడానికి ఈ బిల్లు అనుమతి ఇస్తుందన్నారు. అక్రమ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్న లెక్కల్లో చూపని నగదును గుర్తించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని ఆమె వివరించారు.

మొబైల్ ఫోన్లలో ఎన్‌క్రిప్ట్ చేసిన సందేశాలు రూ. 250 కోట్ల లెక్కల్లో లేని నగదును బయటపెట్టాయని గణాంకాలతో సహా ఆమె వివరించారు. అలాగే వాట్సాప్ సందేశాలతో క్రిప్టో ఆస్తులకు సంబంధించిన ఆధారాలు గుర్తించినట్లు తెలిపారు. వాట్సాప్ కమ్యూనికేషన్‌లో రూ. 200 కోట్లు లెక్కల్లో లేని నగదును వెలికి తీయడానికి సహాయ పడిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

ఇక గూగుల్ మ్యాప్స్.. నగదును దాచడానికి తరచు సందర్శించే ప్రదేశాలను గుర్తించడంలో సహాయపడిందని ఆమె వివరించారు. బినామీల ఆస్తి యాజమాన్యాన్ని నిర్ణయించడానికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను సైతం విశ్లేషించామన్నారు.


ఈ నూతన బిల్లు ద్వారా అధికారులు ఏమి యాక్సెస్ చేయవచ్చునంటే..

కొత్త బిల్లుతో వాట్సాప్, టెలిగ్రామ్, ఈ మెయిల్‌ వంటి డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేసే హక్కును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కల్పిస్తుందని ఆర్థిక మంత్రి వివరించారు. ఇవి కాకుండా అదనంగా, ఆర్థిక లావాదేవీలను దాచడానికి ఉపయోగించే వ్యాపార సాఫ్ట్‌వేర్‌తోపాటు సర్వర్‌లను కూడా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందని స్పష్టం చేశారు. వెల్లడించని ఆదాయం తాలుక వ్యవహారాలను ఈ బిల్లు వెలుగులోకి తీసుకు వస్తుందని ఆమె స్పష్టం చేశారు.


ఆదాయపు పన్ను శాఖ సోదాలు, నగదు స్వాధీన సమయంలో.. వర్చువల్ డిజిటల్ స్థలాలను యాక్సెస్ చేయడానికి ఆ శాఖ అధికారులకు అనుమతి ఇస్తుందన్నారు. ఇది ఈ మెయిల్ సర్వర్‌లు, సోషల్ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్‌లో పెట్టుబడితోపాటు వాణిజ్య ప్లాట్‌ఫారమ్‌లు, ఆస్తి యాజమానుల వివరాలను నిల్వ చేసే వెబ్‌సైట్‌లను కవర్ చేస్తుందని సోదాహరణగా ఆమె వివరించారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025, ఫిబ్రవరి 13వ తేదీన లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

Chain Smoking: చైన్ స్మోకింగ్ మానేయాలంటే.. ఇలా చేయండి..

Actress VishnuPriya: నటి విష్ణు ప్రియకు హైకోర్టులో ఎదురు దెబ్బ

Updated Date - Mar 28 , 2025 | 06:07 PM