Share News

Gali Janardhan Reddy: ‘గాలి’ సంచలన కామెంట్స్.. శ్రీరాములు ఓ నమ్మక ద్రోహి..

ABN , Publish Date - Jan 24 , 2025 | 12:36 PM

మాజీ మంత్రి శ్రీరాములు(Former Minister Sriramulu) నమ్మక ద్రోహి అని, హత్యా రాజకీయాలు ఆయన సొంతమని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి(Former Minister and Gangavathi MLA Gali Janardhan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Gali Janardhan Reddy: ‘గాలి’ సంచలన కామెంట్స్.. శ్రీరాములు ఓ నమ్మక ద్రోహి..

- అవసరం వచ్చినపుడు బండారం బయటపెడతా

- సండూరు ఉప ఎన్నికలపై నిర్లక్ష్యం వహించాడు..

- పార్టీ సర్వేలో వాస్తవాలు బయటపడ్డాయి..

- మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బళ్లారి(బెంగళూరు): మాజీ మంత్రి శ్రీరాములు(Former Minister Sriramulu) నమ్మక ద్రోహి అని, హత్యా రాజకీయాలు ఆయన సొంతమని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి(Former Minister and Gangavathi MLA Gali Janardhan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం బెంగళూరు పారిజాత అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అధిష్ఠానం సండూరు ఉప ఎన్నికల ఓటమి పై సర్వే చేయించిందని, అక్కడ పార్టీ అభ్యర్థి బంగారు హనుమంత విజయానికి శ్రీరాములు పని చేయలేదని గుర్తించిందన్నారు. ఇందుకు తన వద్ద ఆధారాలున్నాయన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: CT Ravi: ఎమ్మెల్సీ సీటీ రవికి రిలీఫ్‌.. నెలాఖరుదాక ఎటువంటి చర్యలు తీసుకోరాదు


వాల్మీకులకు శ్రీరాములు తీరని అన్యాయం చేశారని, పార్టీల్లో ఆ వర్గీయులను ఎవ్వరినీ ఎదగనివ్వలేదని ఆరోపించారు. బళ్లారిలో 40 ఏళ్లుగా పేరున్న ముండ్లూరు దివాకర్‌బాబు, సూర్యనారాయణ రెడ్డి కలిసి చేతిలో శ్రీరాములు అక్క భర్త సొంత మామ రైల్వే బాబు హత్యకు గురయ్యారన్నారు. అప్పుడు అక్కడ సూర్యనారాయణరెడ్డి ఆర్థికంగా సహకరించారన్నారు. ముండ్లూరు దివాకర్‌బాబు, సూర్యనారాయణరెడ్డి కలిసి శ్రీరాములు మామను హత్య చేయించారన్నారు. ఇక శ్రీరాములు కూడా చంపేస్తారని భయపడి తన వద్దకు వచ్చాడనీ, తాను ఆదరించానన్నారు.


pandu1.jpg

ప్య్రతర్థులను చంపుతానని కత్తులు, కొడవళ్లతో తిరిగాడని శ్రీరాములపై ఆరోపించారు. తనను కూడా చంపుతారని అందరూ అన్నారనీ, అయినా బెదరలేదన్నారు. ‘శ్రీరాములును కాపాడాలని మా అమ్మ కోరింది. అరోజు సోదరుడిగా భావించాన’న్నారు. శ్రీరాములు నమ్మకద్రోహంతో తన కుటుంబానికి మోసం చేశారన్నారు. శ్రీరాములు ఎలా ఎదిగాడో అందరికీ తెలుసన్నారు. తాను ఆయనలాంటి వారి అండతో పార్టీలోకి రీ ఎంట్రీ ఇవ్వలేదన్నారు. నేరుగా పెద్దల అండతో చేరుకున్నానన్నారు. అవసరం వచ్చినపుడు మరిన్ని విషయాలు బయట పెడతానన్నారు.


ఈవార్తను కూడా చదవండి: కిడ్నీ మార్పిడి జరిగిందెక్కడ?

ఈవార్తను కూడా చదవండి: నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?

ఈవార్తను కూడా చదవండి: భర్త దొంగ అని తెలిసి షాక్‌.. బిడ్డల్ని చంపి.. తల్లి ఉరి

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: దావోస్ ధమాకా!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 24 , 2025 | 12:36 PM