Biryani: వార్నీ.. ఇదోరకం డ్రామానా.. బిర్యానీలో పురుగులంటూ యువకుడి హల్చల్
ABN , Publish Date - Jan 04 , 2025 | 11:32 AM
ఓ రెస్టారెంట్‌లో మటన్ బిర్యానీ, ఇతర వంటలను ప్రియురాలితో కలిసి ఆరగించిన ఓ యువకుడు బిల్లు చెల్లించడానికి ఇష్టపడక బిర్యానీలో పురుగులున్నాయంటూ నాటకమాడి దొరికిపోయాడు. పోలీసుల కథనం మేరకు, కోవై గాంధీపురం బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌కు నూతన సంవత్సరం రోజున తన ప్రియురాలితో కలిసి వెళ్లిన ఓ యువకుడు బిర్యానీ ఆర్డర్ చేశాడు.
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
చెన్నై: కోయంబత్తూర్(Coimbatore) గాంధీపురంలోని ఓ రెస్టారెంట్‌లో మటన్ బిర్యానీ, ఇతర వంటలను ప్రియురాలితో కలిసి ఆరగించిన ఓ యువకుడు బిల్లు చెల్లించడానికి ఇష్టపడక బిర్యానీలో పురుగులున్నాయంటూ నాటకమాడి దొరికిపోయాడు. పోలీసుల కథనం మేరకు, కోవై గాంధీపురం బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌కు నూతన సంవత్సరం రోజున తన ప్రియురాలితో కలిసి వెళ్లిన ఓ యువకుడు బిర్యానీ ఆర్డర్ చేశాడు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: 10వ శతాబ్దం నాటి శాసనం లభ్యం
అది తింటున్న క్రమంలో చివర్లో కొంత మిగిల్చి అందులో పురుగులున్నాయంటూ రెస్టారెంట్ యాజమాన్యంతో గొడవకు దిగి, ఆ దృశ్యాన్ని వీడియో తీసి, బిల్లు చెల్లించకుండా వెళ్లిపోయాడు. అంతటితో ఆగకుండా గురువారం సాయంత్రం ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో సామిజిక మాద్యమాల్లో ఆ రెస్టారెంటును ప్రజలంతా వ్యతిరేకించారు.
దీంతో అనుమానం వచ్చిన ఆ రెస్టారెంట్ నిర్వాహకులు సీసీ పుటేజీ(CCTV footage)ని క్షుణ్ణంగా పరిశీలించగా వాస్తవం వెలుగు చూసింది. రెస్టారెంటుకు వచ్చిన ఆ ఇద్దరు బిర్యానీ తింటూ తన బ్యాగ్‌లో ప్యాకెట్ నుంచి పురుగులను తీసి వారు తింటున్న ప్లేట్లలో వారే వేసుకున్న దృశ్యం కనిపించింది. దీంతో తమ రెస్టారెంటుపై దుష్ప్రచారం చేసిన ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా, ఆ యువకుడి తీరుపై పలువురు నెటిజన్లు ఖండిస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట
ఈవార్తను కూడా చదవండి: ‘మా శవయాత్రకు రండి’ వ్యాఖ్యపై కేసు కొట్టివేయండి: కౌశిక్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: West Godavari: ఏపీ యువకుడి దారుణ హత్య
ఈవార్తను కూడా చదవండి: Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా
Read Latest Telangana News and National News