Share News

Justice Varma Cash Row: జస్టిస్ వర్మ అంశంపై రాజ్యసభ చైర్మన్ అఖిలపక్ష సమావేశం

ABN , Publish Date - Mar 25 , 2025 | 04:05 PM

జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల వ్యవహారంపై ధన్‌ఖడ్ మాట్లాడుతూ, ఇది కచ్చితంగా చాలా తీవ్రమైన అంశమని అన్నారు. దీనిపై కార్యచరణకు సంబంధించి ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేయమని ఖర్గే సూచించగా, జేపీ నడ్డా అంగీకరించినట్టు తెలిపారు.

Justice Varma Cash Row: జస్టిస్ వర్మ అంశంపై రాజ్యసభ చైర్మన్ అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Yashwant Varma) నివాసంలో నోట్ల కట్టల వ్యవహారంపై కార్యాచరణను నిర్ణయించేందుకు రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankar) అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. రాజ్యసభలోని వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు సమావేశంలో పాల్గొంటారు. సభా నాయకుడు జేపీ నడ్డా, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సైతం హాజరవుతున్నారు.

Kangana Ranaut: 2 నిమిషాల ఫేమ్ కోసమే ఇదంతా.. కునాల్‌పై కంగన మండిపాటు


జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల వ్యవహారంపై ధన్‌ఖడ్ మాట్లాడుతూ, ఇది కచ్చితంగా చాలా తీవ్రమైన అంశమని అన్నారు. దీనిపై కార్యచరణకు సంబంధించి ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేయమని ఖర్గే సూచించగా, జేపీ నడ్డా అంగీకరించినట్టు తెలిపారు. జస్టిస్ వర్మ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు, తొలిసారి ఇందుకు సంబంధించిన సమాచారం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ఉంచడం అసాధరణ విషయంగా తాము ముగ్గురం భావించినట్టు చెప్పారు.


జస్టిస్ వర్మ వ్యవహారంపై ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీ సీజేఐ ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. అయితే, ఇదంతా కుట్ర అని, ఆ నోట్ల కట్టలతో తనకు ఎలాంటి సంబంధం లేదని జస్టిస్ వర్మ చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

Delhi Budget 2025: లక్ష కోట్లతో చారిత్రక బడ్జెట్

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి

High Court: దేవుళ్లు సరిగానే ఉన్నారు... కొందరు మనుషులే తేడా..

Read Latest and National News

Updated Date - Mar 25 , 2025 | 04:08 PM