Home » Jagdeep Dhankar
సుప్రీంకోర్టు అథారిటీని జగదీప్ ధన్‌ఖడ్ ప్రశ్నించడంపై కపిల్ సిబల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ధన్‌ఖడ్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం తనను విచారానికి, దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.
ప్రజాస్వామ్యంలో భారత రాజ్యంగం సుప్రీం అని, రాష్ట్రపతి అయినా ప్రధాని, గవర్నర్లు అయినా దానికి అతీతులు కారని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. పెండింగ్ బిల్లులపై గడువులోగా రాష్ట్రపతి, గవర్నర్లు నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు సరైన సమయంలో సాహసోపేతమైన తీర్పు ఇచ్చిందని అన్నారు.
సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఉపయోగం ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా మారిందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ విమర్శించారు. రాష్ట్రపతి, గవర్నర్లపై న్యాయమూర్తుల అద్భుతమైన అధికారాలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు
ప్రజాస్వామ్యంలో పాలన చేయాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమేనని, కోర్టులు పాలనలో జోక్యం చేసుకోకూడదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. పార్లమెంటుకు, ప్రజలకు ప్రభుత్వమే జవాబుదారి అని రాజ్యసభలో నిర్వహించిన చర్చలో స్పష్టం చేశారు
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల వ్యవహారంపై ధన్‌ఖడ్ మాట్లాడుతూ, ఇది కచ్చితంగా చాలా తీవ్రమైన అంశమని అన్నారు. దీనిపై కార్యచరణకు సంబంధించి ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేయమని ఖర్గే సూచించగా, జేపీ నడ్డా అంగీకరించినట్టు తెలిపారు.
Vice President : గుండెపోటు కారణంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చికిత్స తర్వాత క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుండటంతో ఇవాళ డిశ్చార్జి చేశారు. ఎయిమ్స్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం రాబోయే కొద్దిరోజులు..
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.ఛాతీలో నొప్పి, అసౌకర్యం ఉండడంతో ఆయనను ఆదివారం తెల్లవారు జామున ఎయిమ్స్‌లో చేర్పించారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) ఆవిష్కరణలకు కేంద్ర బిందు వు కావాలని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పిలుపునిచ్చారు.
మెదక్ జిల్లాలో 655 మంది రైతులు సేంద్రియ సేద్యం చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చెప్పారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ ఎరువులతో పంటలు పండించిన రైతులతో సమ్మేళనం నిర్వహించారు.
భావవ్యక్తీకరణ అనేది ప్రజాస్వామానికి నిర్వచనమని, అయితే అర్హమైన విధంగా భావ వ్యక్తీకరణ ఉండాలని, ప్రజాస్వామ్య విలువలను తగ్గించేలా ఉండకూడదని ధన్‌ఖడ్ అన్నారు. ఎవరైనా మాట్లాడేముందు ఇతరుల అభిప్రాయాలను కూడా వినేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.