Share News

Kamakhya Express Derail: పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్

ABN , Publish Date - Mar 30 , 2025 | 02:48 PM

రైలు పట్టాలు తప్పడానికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. ప్రమాదానికి సబంధించిన సమాచారం కోసం రైల్వే అధికారులు హెల్ప్‌లైన్ నెంబర్లు 8991124238 (కటక్), 8455885999 (భువనేశ్వర్) అందుబాటులోకి తెచ్చారు.

Kamakhya Express Derail: పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్

కటక్: బెంగళూరు నుంచి గౌహతికి వెళ్తున్న కామాఖ్య ఎక్స్‌ప్రెస్ (Kamakhya Express) ప్రమాదానికి గురైంది. పదకొండు బోగీలు పట్టాలు తప్పాయి. కటక్-నేర్గుండి రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం 11.54 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.

Chandigarh court verdict: లంచం కేసులో రిటైర్డు హైకోర్టు జడ్జి నిర్మల్‌ యాదవ్‌ నిర్దోషి


ప్రమాద ఘటన తెలిసిన వెంటనే రైల్వే టీమ్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టింది. యాక్టిడెంట్ రిలీప్ ట్రైన్, మెడికల్ రిలీఫ్ ట్రైన్‌ను ఘటనా స్థలికి పంపినట్టు అధికారులు చెప్పారు. రైలు పట్టాలు తప్పడానికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. ప్రమాదానికి సబంధించిన సమాచారం కోసం రైల్వే అధికారులు హెల్ప్‌లైన్ నెంబర్లు 8991124238 (కటక్), 8455885999 (భువనేశ్వర్) అందుబాటులోకి తెచ్చారు. కామాఖ్య ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలను వేరే మార్గానికి మళ్లించారు.


ప్రయాణికులు సురక్షితం

కాగా, 12551 కామాఖ్య సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినట్టు సమాచారం అందిందని, 11 కోచ్‌లు పట్టాలు తప్పాయని, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్‌ఓ అశోక కుమార్ మిశ్రా తెలిపారు. యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్, ఎమర్జెన్సీ మెడికల్ సామాగ్రిని ప్రమాదస్థలికి పంపామని చెప్పారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరుపుతున్నామని, తొలుత రైళ్లను దారిమళ్లించి, పట్టాల పునరుద్ధరణ చర్యలు చేపట్టామని ఉన్నతాధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Nodia Porn Racket: లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ పేరుతో వల.. వెలుగులోకి పోర్న్ రాకెట్

Yatnal: కాంగ్రెస్‌, జేడీఎస్‏లో చేరేది లేదు.. గౌరవంగా పిలిస్తే బీజేపీలోకి వెళ్తా

For National News And Telugu News

Updated Date - Mar 30 , 2025 | 02:52 PM