Karnataka: కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం
ABN , Publish Date - Mar 21 , 2025 | 06:29 PM
తొలుత ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును రాష్ట్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వైపు దుసుకెళ్లారు.

బెంగళూరు: ప్రభుత్వ కాంట్రాక్టులతో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును కర్ణాటక (Karnataka) ప్రభుత్వం శుక్రవారంనాడు ఆమోదించింది. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్తతల మధ్య ప్రభుత్వం ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యేలు బిల్లు ప్రతులను చించేసి స్పీకర్‌పై విసిరారు. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, చట్టబద్ధంగానే దీన్ని ఎదుర్కొంటామని హెచ్చరించారు.
Amit Shah: వచ్చే ఏడాది ఇదేరోజుకి నక్సల్స్‌ని ఏరేస్తాం
18 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
తొలుత ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును రాష్ట్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వైపు దుసుకెళ్లారు. బిల్లు ప్రతులను చించి స్పీకర్ యూటీ ఖడెర్ సీటుపైకి విసిరారు. దీంతీ స్పీకర్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించిన 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. దీనిని బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రతిఘటించడంతో మార్షల్ వారిని అసెంబ్లీ బయటకు తీసుకెళ్లారు.
దీనికి ముందు హనీట్రాప్ అంశం అసెంబ్లీని కుదిపేసింది. జాతీయ స్థాయి నాయకులు సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డారని అసెంబ్లీలో సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న సంచలన ప్రకటన చేయడం సంచలనమైంది. దీనిపై సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ, ఒకసారి కేసు నమోదై దర్యాప్తు ప్రారంభమైతే ఎవరు ఉన్నా వదిలేదని లేదన్నారు. ఎవర్నీ రక్షించే ఉద్దేశం కూడా తమకు లేదన్నారు. దర్యాప్తునకు హోం మంత్రి పరమేశ్వర హామీ ఇచ్చినా బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. సభలో ఆందోళనల మధ్యే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాంతి రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఇవి కూడా చదవండి
MK Stalin: ఎంపీల సంఖ్యతో పాటు రాష్ట్ర హక్కులకు భంగం.. డీలిమిటేషన్‌పై స్టాలిన్
10th Class Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం.. ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు
Judge Corruption: హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు.. అవాక్కైన ఫైర్ సిబ్బంది.. ఏం జరిగిందంటే
Read Latest National News And Telugu News