Share News

Kunl Kamra: కునాల్ కమ్రా వివాదం.. 500 బెదిరింపు కాల్స్ వచ్చాయి.. చంపుతామంటున్నారు

ABN , Publish Date - Mar 26 , 2025 | 08:52 AM

కునాల్ కమ్రా-ఏక్‌నాథ్ షిండే వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఈ వివాదంలో తాజాగా మరో అంశం తెర మీదకు వచ్చింది. కునాల్ కమ్రాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. చంపుతామని బెదిరిస్తున్నారట.

Kunl Kamra: కునాల్ కమ్రా వివాదం.. 500 బెదిరింపు కాల్స్ వచ్చాయి.. చంపుతామంటున్నారు
Kunal Kamra

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై.. స్టాండప్ కమెడిన్ కునాల్ కమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. రోజు రోజుకు ఈ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ముంబై పోలీసులు కునాల్ క్రమాకు నోటీసులు పంపారు. ఇక తాజాగా ఈ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. షిండేను ద్రోహిగా వర్ణిస్తూ.. కునాల్ చేసిన వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని చంపుతామంటూ కాల్స్ చేసి బెదిరిస్తున్నారట. ఇప్పటి వరకు తనకు 500 బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. కాల్ చేసిన వారిలో కొందరు కునాల్ను చంపి.. ముక్కలు ముక్కలు చేస్తామని బెదిరించినట్లుగా తెలుస్తోంది.

తనకు వస్తోన్న బెదిరింపు కాల్స్‌పై కునాల్ స్పందిస్తూ.. "నా నంబర్ లీక్ చేస్తూ.. నాకు కాల్ చేస్తూ బిజీగా ఉన్నవారికి ఒక సూచన.. మీ అందరి కాల్స్ నా వాయిస్‌మెయిల్‌కు వెళ్తున్నాయి. మిమ్మల్ని ఇంత ఆగ్రహానికి గురి చేసిన పాటనే అక్కడ మీరు వినాల్సి వస్తుంది" అన్నాడు.


ఇటీవల ముంబైలో జరిగిన ఓ కామెడీ షోలో కునాల్ క్రమా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండేను ద్రోహిగా వర్ణిస్తూ.. దిల్‌తో పాగల్ హై అనే హిందీ పాటలోని చరణాలను పేరడీ చేసి పాడాడు. అంతేకాక శివసేన, ఎన్‌సీపీల మధ్య వచ్చిన విబేధలపైన కూడా జోక్స్ వేశాడు. ఇది కాస్త వివాదాస్పదంగా మారింది. కునాల్ వ్యాఖ్యాలపై శివసేన కార్యకర్తలు.. కునాల్ షో నిర్వహించిన ప్రాంతంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అంతేకాక శివసేన ఎమ్మెల్యే ముర్జి పటేల్ కునాల్ కమ్రాపై ఖర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. దాంతో పోలీసులు అతడికి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే తనకు ఒక వారం రోజుల వ్యవధి కావాల్సిందిగా కునాల్ కోరినట్లు తెలుస్తోంది.


ఈ వివాదంపై కునాల్ స్పందిస్తూ.. "నేనేం తప్పుగా మాట్లాడలేదు. ఏక్‌నాథ్ షిండే గురించి అజిత్ పవార్ ఏం చెప్పారో.. నేను కూడా అదే చెప్పాను. కనుక నేను ఎవరికి క్షమాపణలు చెప్పను" అని స్పష్టం చేశాడు. అయితే కునాల్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే తన పద్దతిలో అతడితో మాట్లాడతామంటూ శివసేన లీడర్, మహారాష్ట్ర మినిస్టర్ గులాబ్ రఘునాథ్ పటిల్ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

కునాల్ కామ్రాకు నోటీసులు, గడువు కోరిన స్టాండప్ కమెడియన్

2 నిమిషాల ఫేమ్ కోసమే ఇదంతా.. కునాల్‌పై కంగన మండిపాటు

Updated Date - Mar 26 , 2025 | 09:12 AM