Maharashtra: మహారాష్ట్రలో లవ్ జిహాద్ నియంత్రణకు చట్టం!
ABN , Publish Date - Feb 16 , 2025 | 05:44 AM
లవ్ జిహాద్, బలవంతపు మతమార్పిడులను నిరోధించడానికి చట్టం తీసుకురావాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అధ్యయనం చేసేందుకు ఏడుగురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది.

ముంబై, ఫిబ్రవరి 15: లవ్ జిహాద్, బలవంతపు మతమార్పిడులను నిరోధించడానికి చట్టం తీసుకురావాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అధ్యయనం చేసేందుకు ఏడుగురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. డీజీపీ అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో మహిళ, శిశు సంక్షేమం, మైనార్టీ వ్యవహారాలు, న్యాయ, సామాజిక న్యాయం శాఖల కార్యదర్శులు, హోం శాఖ డిప్యూటీ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో లవ్ జిహాద్, మత మార్పిడిలు ఎంతవరకు ఉన్నాయి, వాటిని అరికట్టడానికి చట్టపరంగా ఏమి చేయాలన్నదానిపై అధ్యయనం చేసి సిఫార్సులు చేయనుంది.