Attack: భద్రతా దళాల వాహనాన్ని పేల్చేసి..ఆపై కాల్పులు జరిపిన మావోయిస్టులు
ABN , Publish Date - Mar 23 , 2025 | 08:10 PM
గత అనేక రోజులుగా తమపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా మావోయిస్టులు రివేంజ్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భద్రతా దళాల వాహనాన్ని పేల్చేశారు. ఆ తర్వాత వెంటనే కాల్పులతో వారిపై ఎటాక్ చేశారు.

ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరోసారి ఉగ్రరూపం దాల్చారు. ఈ క్రమంలోనే పోలీసుల భద్రతా సిబ్బంధి వాహనాన్ని మందు పాతరతో పేల్చేశారు. ఈ దాడిలో నలుగురు సైనికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన సైనికులను వెంటనే బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన భూపాలపట్టణం జాతీయ రహదారిపై, గొర్ల నల్ల సమీపంలో చోటు చేసుకుంది. పేలుడు జరిగిన వెంటనే, మావోయిస్టులు సైనికులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి.
కారణమిదేనా..
ఈ ఘటనపై స్థానిక ప్రజలు, భద్రతా బలగాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. మావోయిస్టుల దాడులు సాధారణంగా ఆయా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఈసారి జాతీయ రహదారిపై జరిగిన దాడి, వారి ఉనికి గురించి మరింత స్పష్టంగా చెప్పారని అనిపిస్తోంది. భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే వారు ఎటాక్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్లాన్ ప్రకారమే దాడులా..
ఈ ఘటన నేపథ్యంలో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలను పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రజల భద్రతను కాపాడటానికి అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు మావోయిస్టులు గతంలో వారిపై జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఈ దాడులు చేసినట్లు పలువురు భావిస్తున్నారు. అయితే భద్రతా బలగాల వాహనం పేల్చేసి, వెంటనే కాల్పులు జరిపారంటే పక్కా ప్లాన్‌తోనే ఎటాక్ చేశారని అధికారులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
Onion Prices: గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..
Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News