Liquor Shops: ఏప్రిల్ 1 నుంచి మద్యం షాపులు బంద్.. ఎందుకంటే..
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:25 PM
Liquor Shops: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం, మాంసం దుకాణాలను మూసి వేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను అతి క్రమిస్తే.. లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

భోపాల్, మార్చి 31: నవరాత్రులు ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మైహార్ పట్టణంలో మాంసం, మద్యం విక్రయాలు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను అతిక్రమిస్తే.. షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. వసంత నవరాత్రులు ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో అమ్మ వారి శక్తి పీఠాల్లో ఒకటి.. మైహార్. ఈ నవరాత్రులను ఈ పట్టణంలో తొమ్మిది రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తారు.
పట్టణ వాసులు సైతం భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు. ఈ నేపథ్యంలో ఈ శక్తిపీఠాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది మైహార్ పట్టణానికి తరలి వస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్రంలోని భోపాల్, ఇండోర్‌లలో సైతం మాంసం షాపులను మూసి వేయనున్నారు.ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మైహార్‌తో సహా 17 పట్టణాల్లో మద్యం దుకాణాలను శాశ్వతంగా మూసి వేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రతి ఏటా అమ్మవారి నవరాత్రులు నాలుగు సార్లు జరుపుకుంటారు. కానీ చాలా మందికి ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు మాత్రమే తెలుసు. అంటే దసరా పండగ వేళ జరిగే నవరాత్రి వేడుకలు మాత్రమే తెలుసు. అయితే శరన్నవరాత్రులకు ఎంత ప్రాధాన్యత ఉందో.. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరుపుకొనే వసంత నవరాత్రలకు అంతే ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో ఉగాది నాటి నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమైనాయి. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Ranya Rao: వెలుగులోకి సంచలన విషయాలు..
Also Read: తొక్కే కదా అని పారేస్తున్నారా.. దీనిలోని పోషకాలు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..
Sanjay Raut: మోదీ ఆ ప్లాన్‌తోనే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారేమో..
వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే
Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు
For National News And Telugu News