MLA: ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన.. సీఎం ఆగ్రహం
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:31 AM
నిండు అసెంబ్లీలో ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించడంపై ముఖ్యమంత్రి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన విషయం కాస్త రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

చెన్నై: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో దురుసుగా ప్రవర్తించిన తమిళగ వాల్వురుమై కట్చి అధ్యక్షుడు, ఎమ్మెల్యే వేల్ మురుగన్(MLA Velu Murugan)పై సీఎం స్టాలిన్(Stalin) ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల్‌మురుగన్ ఈ బడ్జెట్ సమావేశాల్లో తన నియోజకవర్గానికి సంబంధంలేని అంశాలను కూడా ప్రస్ధావించడం సరికాదని ముఖ్యమంత్రి మందలించారు. రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లపై నాలుగో రోజైన గురువారం కూడా చర్చ జరిగింది. ఇందులో పాల్గొన్న సభ్యులు తమ నియోజకవర్గాల్లో తిష్టవేసిన సమస్యల గురించి ప్రస్థావించగా, సంబంధిత శాఖల మంత్రులు సమాధానం చెప్పారు.
ఈ వార్తను కూడా చదవండి: Tattoo: నాటి పచ్చబొట్టు.. నేటి టాటూ
ముందుగా సభలో కులాల వారీ జనగణనపై జరిగిన చర్చలో పీఎంకే ఎమ్మెల్యే జీకే మణి పాల్గొని ఈ అంశంపై ప్రభుత్వం పరిశీలించి చర్యలు చేపట్టాలని కోరారు. అందుకు మంత్రి మెయ్యనాఽథన్ కులగణన నిర్వహించే అధికారం కేంద్రప్రభుత్వానికే ఉందన్నారు. మధ్యలో జోక్యం కలుగజేసుకున్న వేల్‌మురుగన్, కులగణనను రాష్ట్రప్రభుత్వాలు నిర్వహించకూడదని సుప్రీంకోర్టు చెప్పలేదని ప్రభుత్వాన్ని విమర్శించేలా వ్యాఖ్యానించారు.
అంతటితో ఊరుకోకుండా రాష్ట్రంలో కులగణన నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలను వ్యక్తంచేస్తూ, లేచి నిలబడి మంత్రులను వేలెత్తి చూపుతూ, దురుసుగా వ్యవహించడంతో పాటు, స్పీకర్ అప్పావు పోడియం వద్దకు వెళ్లితనకు మాట్లాడేందుకు అనుమతించాలని కోరి, అనుమతించకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభా మర్యాదలను గౌరవించకుండా సభాపతి పట్ల అమర్యాదగా ప్రవర్తించిన వేల్‌మురుగన్ చర్యలతో ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ఆగ్రహం చెందారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే వేల్‌మురుగన్ అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరు సభ్యులందరిని అవేదనకు గురిచేసిందని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవల్సిందిగా స్పీకర్ అప్పావుకు విజ్ఞప్తి చేశారు. అధికార డీఎంకే కూటమి తరుఫున 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కడలూరు జిల్లా పన్రుట్టి నియోజకవర్గంలో ఉదయించే సూర్యుని గుర్తుపై పోటీచేసి వేల్‌మురుగన్ గెలుపొందడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి:
Online Betting: ముదిరిన బెట్టింగ్ వ్యవహారం.. తారలపై కేసులు
BJP: రాజాసింగ్‌కు బుల్లెట్ ప్రూఫ్ కారు
పంచుకు తింటే.. పట్టు వచ్చినట్లా?
Read Latest Telangana News and National News