Share News

Viral News: కవలలు విసిగిస్తున్నారని.. తల్లి చేసిన ఘోరం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ABN , Publish Date - Jan 03 , 2025 | 09:49 AM

Rajasthan: ఎంతో అపరూపంగా చూసుకోవాల్సిన బిడ్డల పట్ల ఆ తల్లి వ్యవహరించిన తీరు మాతృత్వానికి మాయని మచ్చగా నిలిచింది. అల్లరి చేయని పిల్లలు ఉండరు.. పసితనంలో వారి అల్లరే ఇంటిలో ఆనందాన్ని తెచ్చిబెడుతుంది. కానీ అల్లరి చేస్తున్నారని ఓ తల్లి తీసుకున్న నిర్ణయం షాక్‌కు గురయ్యేలా చేసింది.

Viral News: కవలలు విసిగిస్తున్నారని.. తల్లి చేసిన ఘోరం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Mother kills twins by poison

రాజస్థాన్, జనవరి 3: నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డపై ఏ తల్లికి మమకారం ఉండదు చెప్పండి. అసలు గర్భిణీ అయిన వెంటనే ఆ తల్లి కడుపులో ఉన్న బిడ్డపై ఎనలేని ఆప్యాయతను పెంచుకుంటుంది. తొమ్మిది నెలలు కడుపులో మోసి ఆ తరువాత బిడ్డకు జన్మనిస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డను చూసి ఆ తల్లి ఆనందం అంతా ఇంతా ఉండదు. తమ బిడ్డల జోలికి ఎవరైనా వస్తే సహించదు తల్లి. వారు ఎంత అల్లరి చేసిన ఓపికతో భరిస్తుంది. వారి భవిష్యత్ కోసం ఎన్నో త్యాగాలను కూడా చేస్తుంది. కానీ ఇప్పుడు చూడబోయే వార్త మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అసలు ఈమె కన్నతల్లేనా అనే అనుమానం కలుగుతుంది. ఎంతో అపరూపంగా చూసుకోవాల్సిన బిడ్డల పట్ల ఆ తల్లి వ్యవహరించిన తీరు మాతృత్వానికి మాయని మచ్చగా నిలిచింది. అల్లరి చేయని పిల్లలు ఉండరు.. పసితనంలో వారి అల్లరే ఇంటిలో ఆనందాన్ని తెచ్చిబెడుతుంది. కానీ అల్లరి చేస్తున్నారని ఓ తల్లి తీసుకున్న నిర్ణయం షాక్‌కు గురయ్యేలా చేసింది. తన తల్లి ఏం చేస్తుందో తెలియకుండానే ఆ చిన్నారులు ఆమెతో ఎప్పటిలాగే నవ్వుతూ గడిపారు. అభంశుభం తెలియని ఆ చిన్నారుల పట్ల మాతృత్వాన్ని మరిచి ప్రవర్తించింది తల్లి. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఓ తల్లి తన కవల పిల్లల అల్లరిని భరించలేక కఠిన నిర్ణయం తీసుకుంది. చిన్నారులకు పాలల్లో విషం ఇచ్చి తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. అయితే చనిపోయే ముందు తాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో చెప్పిన విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది.


అసలేం జరిగిందంటే...

రాజస్థాన్‌లోని శిరగంజ్ ప్రాంతానికి చెందిన రేఖ, పూర్విత్ దంపతులకు ఇద్దరు కవలలు. ఇద్దరూ మగపిల్లలే. వారికి ఒకటిన్నర సంవత్సరాలు. పూర్విత్ మహారాష్ట్రలో టైలరింగ్ పని చేస్తున్నాడు. రేఖ తన ఇద్దరు కవలపిల్లలతో కలిసి పాలి జిల్లాలోని సేవడిలో తల్లి వద్ద నివసిస్తోంది. అయితే తన ఇద్దరు కుమారులను చూసుకోవడంలో తాను ఎంతగానో అలిసిపోతున్నాని తల్లి రేఖ భావించింది. అందులోనూ ఇద్దరు పిల్లలు అంటే తల్లికి ఇష్టం లేదు. వారు చేస్తున్న అల్లరిని చూసి రేఖ భరించలేకపోయింది. దీంతో తాను అలసిపోతున్నాను అంటూ భావించిన రేఖ మాతృత్వాన్ని మరిచి కసాయి తల్లిగా మారింది. ముందుగా పిల్లలు తాగే పాలల్లో విషం కలిపి వారికిచ్చింది. విషం కలిపిన పాలు తాగి చిన్నారులు ఇద్దరు మృత్యువాత పడ్డారు.

కస్టోడియల్ టార్చర్ కేసు.. రంగంలోకి రఘురామ


ఆ తరువాత తల్లి రేఖ కూడా విషం తాగింది. వీరిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారులు ఇద్దరు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. ఆ తరువాత చికిత్స పొందుతూ రేఖ కూడా మరణించింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే రేఖ చేసిన పనిపై ప్రతీఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభంశుభం తెలియని చిన్నారులను ఎలా చంపాలనిపించింది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. విగతజీవులుగా ఉన్న చిన్నారులను చూసి ప్రతీ ఒక్కరూ అయ్యో పాపం అంటూ కంటతడిపెడుతున్నారు. అయితే చిన్నారుల ఆలనా పాలనా చూడటంలో విసిగిపోయానంటూ తల్లి చేసిన ఈ నిర్వాకం ఇప్పుడు సంచలనంగా మారింది.


ఇవి కూడా చదవండి..

పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. 87A పన్ను మినహాయింపు

ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. వీటిల్లో ఏది బెటర్?

Read Latest National News And Telugu News

Updated Date - Jan 03 , 2025 | 09:53 AM