Aurangzeb tomb row: ఒసామాబిన్ లాడెన్ ప్రస్తావన చేసిన ఏక్‌నాథ్ షిండే
ABN , Publish Date - Mar 19 , 2025 | 04:14 PM
తమ గడ్డపై ఒసామాబిన్ లాడెన్‌ను పూడ్చిపెట్టేందుకు అమెరికా నిరాకరించిందని, అతని మృతదేహాన్ని సముద్రంలో గుర్తుతెలియని ప్రాంతంలో డిస్పోజ్ చేసిందని ఏక్‌నాథ్ షిండే చెప్పారు. తద్వారా లాడెన్‌ను ఎవరూ కీర్తించకుండా అడ్డుకట్ట వేసిందని అన్నారు.

ముంబై: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి తొలిగించాల్సిందేనంటూ జరుగుతున్న వివాదం ముదురుతోంది. ఈ అంశంపై మహారాష్ట్ర శాసనండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య బుధవారంనాడు గందరగోళం చెలరేగింది. దీనిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథా షిండే (Eknath Shinde) మండలిలో మాట్లాడారు. ఔరంగబేజ్‌ను కొందరు కొనియాడుతుండటంపై విసుర్లు విసిరారు. ఔరంగజేబును ఒసామాబిన్ లాడెన్‌తో పోల్చారు. తమ గడ్డపై ఒసామాబిన్ లాడెన్‌ను పూడ్చిపెట్టేందుకు అమెరికా నిరాకరించిందని, అతని మృతదేహాన్ని సముద్రంలో గుర్తుతెలియని ప్రాంతంలో డిస్పోజ్ చేసిందని చెప్పారు. తద్వారా లాడెన్‌ను ఎవరూ కీర్తించకుండా అడ్డుకట్ట వేసిందని అన్నారు.
Nagpur Violce: నాగపూర్ హింసాకాండ ప్రధాన సూత్రధారి అరెస్టు
ఔరంగజేబు సమాధిని తొలగించాలని ఓ వైపు రైట్ వింగ్ సంస్థలు డిమాండ్ చేస్తుంటే ఆయనను కీర్తించడం ఏమిటని షిండే నిలదీశారు. ''ఔరంగబేబు ఎవరు? మన రాష్ట్రంలో ఆయనన కీర్తించడానికి మనం ఎందుకు అనుమతించాలి? రాష్ట్ర చరిత్రలో ఆయన ఒక మాయని మచ్చ'' అని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మరాఠా రాజు ఛత్రపతి శంజీరాజేను ఇస్లాంలోకి మారాలని ఔరంగబేబు ఛాన్స్ ఇచ్చినా అందుకు శంభాజీ ఒప్పుకోలేదని, దీంతో ఆయనను చిత్రహింసపెట్టి మరీ చంపారని గుర్తుచేశారు. అమెరికా సైతం ఒసామా బిన్ లాడెన్‌ను ఎవరూ కీర్తించడానికి తావీయకుండా, సొంత గడ్డపై కాకుండా సముద్రం మధ్యలో అతని మృతదేహాన్ని పూడ్చేసిందని అన్నారు
దేవేంద్ర ఫడ్నవిస్ పాలనను ఔరంగజేబు పాలనతో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ పోల్చడాన్ని కూడా షిండే తిప్పికొట్టారు. ఔరంగజేబు, ఫడ్నవిస్ ఒకటేనా అని నిలదీశారు. ఔరంగబేజు శత్రువుల పట్ల వ్యవహరించిన రీతిలో ఫడ్నవిస్ ఎప్పుడూ ఇతరుల పట్ల వ్యవహరించలేదని అన్నారు. ముఖ్యమంత్రి మీపట్ల అనుచితంగా ప్రవర్తించారా అని శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే అనిల్ పరబ్ వైపు తిరిగి ప్రశ్నించారు.
నాగపూర్‌లో హింస
ఔరంగబేజ్ సమాధిని తొలిగించాలనే వీహెచ్‌పీ డిమాండ్ల మధ్య ఒక మతగ్రంథం తగులబెట్టారనే వదంతులు వ్యాప్తి చెందడంతో గత సోమవారం సాయంత్రం నాగపూర్ మహల్ ఏరియాలో హింసాకాండ చెలరేగింది. దుండగులు పలు వాహనాలు, ఆస్తులకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 50 మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. నాగపూర్ హింసాకాండ ముందస్తు కుట్ర జరిగిందా అనే దానిపై విచారణ జరుపుతున్నామని, ఈ ఘటనలో 34 మంది పోలీసులు కూడా గాయపడ్డారని ఏక్‌నాథ్ షిండే తెలిపారు.
ఇవి కూడా చదవండి
PM Narendra Modi: చెక్కుచెదరని విశ్వాసానికి సునీతా విలియమ్స్ నిదర్శనం: ప్రధాని మోదీ..
Ranya Rao: సినిమాలు వదిలేసి.. దుబాయికు రన్యారావు.. ఈ ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే వాస్తవాలు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి