Nagpur Violence: అల్లర్లకు పాల్పడిన వారి నుంచే ఆస్తి నష్టం వసూలు: ఫడ్నవిస్
ABN , Publish Date - Mar 22 , 2025 | 05:05 PM
హింసకు కారణమైన వారి నుంచి ఆస్తి నష్టం మొత్తాన్ని వసూలు చేస్తామని, వారు డబ్బులు చెల్లించని పక్షంలో వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని విక్రయిస్తామని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు.

ముంబై: మహారాష్ట్రలోని నాగపూర్ (Nagpur) లో మార్చి 17న చెలరేగిన అల్లర్లలో పెద్దఎత్తున ఆస్తినష్టం, రాళ్లదాడులు, వాహనాలకు నిప్పుపెట్టిన ఘటనలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) ఘాటుగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులతో జరిపిన సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హింసకు కారణమైన వారి నుంచి ఆస్తి నష్టం మొత్తాన్ని వసూలు చేస్తామని చెప్పారు. వారు డబ్బులు చెల్లించని పక్షంలో వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని విక్రయిస్తామన్నారు. హింసాకాండ ఘటనల్లో పోలీసులపై దాడికి దిగిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
Shashi Tharoor Selfie: శశిథరూర్ సెల్ఫీ కలకలం.. బీజేపీ ఎంపీతో కలిసి జర్నీ
సీసీటీవీ ఫుటేజ్, వీడియో రికార్డులను విశ్లేషించి 104 మంది నిందితులను గుర్తించామని, 92 మందిపై ఇప్పటికే చర్యలు ప్రారంభించామని సీఎం తెలిపారు. వీరిలో 12 మంది మైనర్లు కూడా ఉన్నారని చెప్పారు. 1992 తర్వాత ఇలాంటి ఘటనలేవీ చోటుచేసుకోలేదనీ, పోలీసులపై దాడికి దిగిన వారినెవ్వరినీ విడిచిపెట్టమని చెప్పారు. అల్లర్లు చెలరేగిన 4-4.5 గంటల్లోనే పోలీసులు పరిస్థితిని అదుపు చేశారని, అయితే డీసీపీ స్థాయి అధికారితో సహా పలువురు పోలీసులు గాయపడ్డారని తెలిపారు.
అల్లర్లలో బంగ్లాదేశీయుల హస్తం ఉందా అనే విషయంపై అడిగినప్పుడు, ప్రస్తుతం దీనీపై ఏమీ చెప్పలేమని, దర్యాప్తు కొనసాగుతోందని ఫడ్నవిస్ తెలిపారు. దీని వెనుక ఎవరు ఉన్నా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..