Gangster: పోలీస్ శాఖలో గ్యాంగ్‌స్టర్.. చివరకు భలే దొరికాడు
ABN , Publish Date - Jan 15 , 2025 | 03:53 PM
Gangster : పోలీసులు గాలిస్తున్న గ్యాంగ్‌స్టర్.. వారితోనే దాదాపు మూడు దశాబ్దాలకుపైగా కలిసి తిరిగాడు. కానీ పోలీసులు మాత్రం అతడిని గుర్తించ లేదు. ఇంతకీ పోలీసులనే బురిడి కొట్టించిన ఎవరా గ్యాంగ్‌స్టర్?
సీసీ కెమెరాలు లేవు. మనం ఏం తప్పు చేసినా.. ఎవరు పసిగట్టడం లేదని అంతా అనుకొంటారు. కానీ దేవుడు నిఘా మాత్రం అందరిపై ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. చేసిన పాపం మనతోనే ఉంటుంది. మనతోనే పోతుంది అని అంతా అనుకుంటారు. ఆ విషయాన్ని కాలక్రమేణా అంతా మరిచి పోయినా.. మనం చేసిన తప్పును కాలమే సరైన సమయంలో సరైన విధంగా వెలుగులోకి తీసుకు వస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉదంతమే అందుకు ఉదాహరణ. అందుకు నక్దు యాదవ్ జీవితమే సాక్ష్యం. ప్రస్తుతం నక్దు యాదవ్ వయస్సు 55 ఏళ్లుపైనే ఉంటాయి. 1980వ దశకంలో అతడి తన నేర జీవితాన్ని ప్రారంభించారు. అంటే.. హత్యలు చేశాడు. అలాగే పలు దోపిడిలకు సైతం పాల్పడ్డాడు. అంతేకాదు.. వ్యవస్థీకృత నేరాలు కూడా చేశాడు. దీంతో అతడిని గ్యాంగ్‌స్టర్‌గా పోలీసులు భావించారు. అతడిపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఒక రోజు.. అతడు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. అనంతరం అతడి కోసం పోలీసులు గాలించినా ప్రయోజనం మాత్రం లేకుండా పోయింది.
అయితే నాలువ తరగతి వరకే విద్యా భ్యాసం చేసిన నక్దు యాదవ్1989లో.. మాస్టర్ ప్లాన్ వేశాడు. అందులోభాగంగా నందలాల్ యాదవ్‌గా తన పేరు మార్చుకొన్నాడు. నకిలీ సంతకాలతో.. దొంగ కాగితాలను సృష్టించాడు. అలాగే తాను 8వ తరగతి వరకు చదివినట్లు నకిలీ సర్టిఫికేట్లు సైతం తయారు చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా... తనపై నిఘా ఉంచిన పోలీస్ శాఖలోనే హోం గార్డ్‌గా అతడు జాయనయ్యాడు. దాదాపు 35 ఏళ్ల పాటు పోలీస్ శాఖలోనే హోం గార్డ్‌గా.. రాణికి సరాయ్ పోలీస్ స్టేషన్‌లో అతడు విధులు నిర్వహించాడు. అయితే విధి నిర్వహణలో భాగంగా నందలాల్ యాదవ్.. నీతి నిజాయితీతోపాటు ఉన్నతాధికారుల మనస్సు సైతం అతడు చోరగొన్నాడు. దీంతో తన ఉద్యోగానికి ఏ మాత్రం ఢోకా లేదని భావించాడు. తనను ఎవరు పసి గట్టలేరనుకొన్నాడు. అలాగే గతంలో తాను చేసిన దారుణాలు సైతం జనం మరిచిపోయారని భావించాడు. కానీ అతడి కుటుంబంలో చోటు చేసుకొన్న కలహాలే.. నందలాల్ యాదవ్ అలియాస్ నక్దు యాదవ్‌ను చట్టానికి పట్టిస్తాయని అసలు ఊహించలేదు.
గతేడాది అంటే.. 2024, అక్టోబర్‌లో నక్దు యాదవ్ కుటుంబంలో కలహాలు చోటు చేసుకున్నాయి. తద్వారా చాలా కాలంగా తనలో దాచిన రహస్యం బహిర్గతమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. నక్దు యాదవ్ మేనల్లుడు పేరు కూడా నందలాల్ యాదవే. అతడికి పొరుగింటి వారికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ పంచాయతీ కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఆ క్రమంలో అతడి మేనమామ నక్దు యాదవ్ అలియాస్ నందలాల్ యాదవ్ చేసిన మోసాన్ని వెలుగులోకి తీసుకు వచ్చింది. దీంతో పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులు సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు. తాము ఎంతో కాలంగా వేతికిన వ్యక్తి.. మనతో పాటే.. తన సహాచరుడుగా ఉంటున్నా కూడా మనం గుర్తించ లేక పోయామంటూ పోలీస్ శాఖలోని ఓ విధమైన అసహనం వ్యక్తమైంది. ఆ క్రమంలో నక్దు యాదవ్ వ్యవహారంలో సమాగ్ర దర్యాప్తునకు అజమ్‌గఢ్ డీఐజీ వైభవ్ కృష్ణ ఆదేశించారు. మరోవైపు నక్దును పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి.. అతగాడిని జైలుకు తరలించారు.అలాగే అతడిని విధుల నుంచి తొలగించారు.
ఇక అజమ్ గఢ్ జిల్లా ఎస్పీ హేమరాజ్ మీనా సైతం ఈ వ్యవహారంపై కూపీ లాగుతోన్నారు. అందులోభాగంగా.. నక్దు ఇంత కాలం పట్టుపడకుండా ఎలా తప్పించు కోగలిగాడనే అంశంపై దృష్టి సారించారు. ఇందులో ఏమైనా సంస్థాగత వైఫల్యం దాగి ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతోన్నారు. అదే విధంగా నక్దు నేర చరిత్రతో పాటు అతగాడి నకిలీ లీలలు బహిర్గతం కావడంతో.. అతడి ఇలా వ్యవహరించడం వెనుక పోలీసుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో సైతం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ మీనా వివరించారు.
రాణికీ సరాయ్ పోలీస్‌స్టేషన్ పోలీసులు సైతం అతడిని ఇంత కాలం ఎందుకు గుర్తించ లేదనే అంశంపై వారు ఆరా తీస్తున్నారు. హోమ్ గార్డ్ ఉద్యోగం చేపట్టే సమయంలో అతడి సర్టిఫికేట్లను పోలీస్ ఉన్నతాధికారులు ఎందుకు పరిశీలించ లేదు? ఓ వేళ పరిశీలించినా.. చూసి చూడనట్లు వారు వ్యవహరించారా? అని సందేహాలు సైతం వ్యక్తమవుతోన్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ నిర్ణయించింది.
For National News And Telugu News