BIg Alert: కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలుసా..రూ.25 వేల ఫైన్, జైలు శిక్ష కూడా..
ABN , Publish Date - Mar 18 , 2025 | 06:12 PM
వాహనదారులకు బిగ్ అలర్ట్. ఎందుకంటే దేశంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చేశాయి. గతంలో ఉన్న జరిమానాలను ఇప్పుడు భారీగా పెంచేశారు. ఎలాగంటే రూ. 25 వేల వరకు ఫైన్ విధిస్తున్నారు.

దేశంలో ప్రతి రోజు కూడా అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమేనని పలు నివేదికల్లో వెలుగులోకి వచ్చింది. దీంతో గతంలో కూడా భారత ప్రభుత్వం ట్రాఫిక్ ఉల్లంఘనలను కఠినతరం చేసి జరిమానాలను పెంచింది. అయినా కూడా అనేక మంది వాటిని పట్టించుకోవడం లేదు. ఇలాగే జరిగితే ప్రమాదాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం.. మార్చి 1, 2025 నుంచి ట్రాఫిక్ ఉల్లంఘనలను మరింత కఠినతరం చేసింది.
భారీగా జరిమానాలు
ఈ క్రమంలో మార్చి 1, 2025 నుంచి దేశంలో కొత్త మోటారు వాహన చట్టం నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు పడుతున్నాయి. అంతేకాదు పలు సందర్భాలలో జైలు శిక్షలు కూడా విధిస్తున్నారు. గతంలో సాధారణంగా జరిమానాలు రూ.1000-1500 మధ్య ఉండేవి. కానీ, ఇప్పుడు ఆయా ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు పెరిగాయి.
హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేస్తే..
గతంలో హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేస్తే రూ. 100 చలాన్ చెల్లించాల్సి వచ్చేది. కానీ, కొత్త చట్టం ప్రకారం ఈ ఉల్లంఘనపై రూ. 1000 జరిమానా విధించబడుతుంది. అంతే కాకుండా డ్రైవర్ లైసెన్స్‌ను 3 నెలలు రద్దు కూడా చేస్తారు.
సీటు బెల్ట్ ధరించకపోవడం
సీటు బెల్ట్ ధరించకుండా కారు నడపితే ఇది వరకు రూ.100 జరిమానా ఉండేది. కానీ ఇప్పుడు, ఈ ఉల్లంఘనకు రూ. 1000 ఫైన్ పడ్తుంది.
డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడటం
డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడడం ఇప్పటికే చాలా ప్రమాదకరమైన విషయం. పాత చట్టం ప్రకారం, ఈ ఉల్లంఘనపై రూ. 500 జరిమానా ఉండేది. ఇప్పుడు, కొత్త చట్టం ప్రకారం రూ. 5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం
గతంలో, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 500 జరిమానా ఉండేది. కానీ, ఇప్పుడు ఈ ఉల్లంఘనకు రూ. 5000 జరిమానా చెల్లించాలి. అలాగే, బీమా పత్రాలు లేకుండా వాహనం నడిపితే రూ.2000 జరిమానా, 3 నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్
ఇద్దరి కంటే ఎక్కువ మంది ద్విచక్ర వాహనంపై ప్రయాణించటం కూడా తీవ్రంగా పరిగణిస్తారు. ఇది గతంలో రూ.100 ఉండగా, ఈ ఉల్లంఘనపై ఇప్పుడు రూ. 1000 జరిమానా విధించనున్నారు.
కాలుష్య ధృవీకరణ పత్రం లేకుండా వాహనం నడపడం
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా వాహనం నడపడం మునుపటి చట్టం ప్రకారం రూ. 1000 జరిమానా ఉండేది. కానీ, ఇప్పుడు ఈ ఉల్లంఘనపై రూ.10,000 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష ఉంటుంది.
ప్రమాదకరమైన డ్రైవింగ్, రేసింగ్
ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ రేసింగ్, అధిక వేగంతో వాహనం నడిపితే రూ. 500 జరిమానా ఉండేది. కానీ, ఈ ఉల్లంఘనకు ఇప్పుడు రూ. 5000 జరిమానా విధించబడుతుంది.
అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోవడం
అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుండా వెళ్ళడం మునుపటి చట్టంలో రూ. 1000 జరిమానా ఉండేది. కానీ ఇప్పుడు రూ. 10,000 జరిమానా విధించనున్నారు.
సిగ్నల్ జంప్ నిబంధన
మరొక ముఖ్యమైన మార్పు రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే గతంలో రూ.500 జరిమానా ఉండేది. కానీ, ఇప్పుడు ఈ ఉల్లంఘనకు రూ.5000కు చేరింది. ఇదే రూల్ ఓవర్ లోడ్ వాహనం చేస్తే రూ.20 వేల ఫైన్ విధిస్తారు.
అత్యంత కఠినమైన చర్య
ఈ క్రమంలో మైనర్లు వాహనం నడిపినా లేదా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినా ఫైన్ మరింత ఎక్కువగా ఉంటుంది. గతంలో దీనికోసం రూ. 2500 ఉండగా, దీనిని రూ. 25 వేలకు పెంచారు. దీంతోపాటు మూడేళ్ల జైలు శిక్ష, వాహనం రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తారు. దీంతోపాటు ఆ యువకులకు 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా మంజూరు చేయరు.
ఇవి కూడా చదవండి:
Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News