Share News

Minister: నో డౌట్.. ఐదేళ్లూ సిద్దరామయ్యే ముఖ్యమంత్రి

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:40 PM

సిద్దరామయ్య(Siddaramaiah) ఐదేళ్ల కాలం సీఎంగా కొనసాగుతారని, మధ్యలో మార్పు ఏమీ ఉండదని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌(Minister M.B. Patil) అన్నారు. శుక్రవారం హొస్పేట్‌ నగరంలో సిరసంగి లింగరాజ దేశాయ్‌ 164 జయంతి లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.

Minister: నో డౌట్.. ఐదేళ్లూ సిద్దరామయ్యే ముఖ్యమంత్రి

- పరిశ్రమల శాఖామంత్రి ఎంబీ పాటిల్‌

బెంగళూరు: సిద్దరామయ్య(Siddaramaiah) ఐదేళ్ల కాలం సీఎంగా కొనసాగుతారని, మధ్యలో మార్పు ఏమీ ఉండదని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌(Minister M.B. Patil) అన్నారు. శుక్రవారం హొస్పేట్‌ నగరంలో సిరసంగి లింగరాజ దేశాయ్‌ 164 జయంతి లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండేళ్ల తరువాత కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి మార్పు ఓప్పందం జరిగింది కదా మరి సీఎం మారుతారా అని విలేకరులు ప్రశ్నించగా ఇందుకు మంత్రి బదులిస్తూ అలాంటి మార్పు ఏమీ లేదు సిద్దరామయ్య ఐదేళ్ల ముఖ్యమంత్రి, రెండేళ్ల ముఖ్యమంత్రి కాదు అని బదులిచ్చారు. రాజకీయ నేపథ్యంలో అనేక మార్పులు జరగవచ్చు కానీ సీఎం గా సిద్దరామయ్య ఉంటారని అన్నారు. హంపీ కన్నడ విశ్వవిద్యాలయం సమీపంలో ఇదివరకూ కేటాయించిన భూమిలో యూనివర్శిటీకే కేటాయించారన్నారు. ముడా కేసులో బీజేపీ రాద్ధాంతం చేసిందన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Collector: వడ్డీవ్యాపారుల బెదిరింపులకు.. ఊరు వదలొద్దు


విందులు.. వివాదాస్పద వ్యాఖ్యలు

రాష్ట్ర రాజకీయాల్లో విందులు, వివాదాస్పద వ్యాఖ్యలు, అధిష్ఠానం హెచ్చరికలు సాగుతున్న తరుణంలోనే మంత్రి పాటిల్‌(Minister Patil) ప్రకటన పార్టీలో కలకలం రేపింది. మంత్రి సతీశ్‌జార్కిహొళి(Minister Satish Jarkiholi) కొందరికి విందు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత మంత్రి పరమేశ్వర్‌ ఆహ్వానించడంతో అధిష్ఠానం తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. విందులకు అధిష్ఠానం ద్వారా చెక్‌ పెట్టించిన డీసీఎం డీకే శివకుమార్‌కు మరోసారి ఆగ్రహం కలిగించేలా మంత్రి ఎంబీ పాటిల్‌ వ్యాఖ్యానించారు.


pandu2.2.jpg

విందు విషయంలోనూ మంత్రి రాజణ్ణ నేరుగా డీకే శివకుమార్‌(DK Shivakumar)ను ఉద్దేశించి మేం విందు చేసుకుంటే ఆయన ఆస్తులు ఏమైనా కోరుతున్నామా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇలా సాగుతుండగానే మంత్రి ఎంబీ పాటిల్‌ కుడా సిద్దరామయ్యకు మద్దతు ఇచ్చేలా ఐదేళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పడం వివాదమైంది. తాజాగా శుక్రవారం మంత్రి రాజణ్ణ బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. అధికారం పంచుకునేందుకు డీకే శివకుమార్‌ సిద్ధమవుతున్నారని, అంతకంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించి ఐదేళ్లు ముఖ్యమంత్రి కావచ్చునన్నారు.


మార్చిలో అధికార మార్పు ఉంటుందనే చర్చల నేపథ్యంలోనే రాజణ్ణ మాట్లాడారు. రాజకీయ నాయకులకు అధికార ఆశ తప్పు కాదని అయితే 2023 ఎన్నికల్లో సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ ఉమ్మడి నేతృత్వానికి ప్రజలు ఆశీస్సులు అందించారన్నారు. 2028లో జరిగే ఎన్నికల్లో గెలుపు సాధించి డీకే శివకుమార్‌ సంపూర్ణంగా సీఎం కావచ్చునన్నారు. హోమాల పట్ల తనకు నమ్మకం లేదని ఒక్కొక్కరి ఒక్కో అభిప్రాయమన్నారు. త్వరలోనే అధిష్ఠానం ముఖ్యులు బెంగళూరుకు రానున్నట్టు సమాచారం. ఆ పరిణామం ఎలా ఉంటుందో వేచి చూడాలి.


ఈవార్తను కూడా చదవండి: Travel Rush: పట్నం బైలెల్లినాదో!

ఈవార్తను కూడా చదవండి: HMDA: మహా అప్పు కావాలి!

ఈవార్తను కూడా చదవండి: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం

ఈవార్తను కూడా చదవండి: నాకు ఆ భూమితో సంబంధం లేదు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 11 , 2025 | 12:40 PM