Share News

MK Stalin: ఎంపీల సంఖ్యతో పాటు రాష్ట్ర హక్కులకు భంగం.. డీలిమిటేషన్‌పై స్టాలిన్

ABN , Publish Date - Mar 21 , 2025 | 03:56 PM

జనాభా ప్రాతిపదికన పునర్విభజనను తమిళనాడు ప్రభుత్వం తొలుత వ్యతిరేకించిందని, రాష్ట్రంలోని 58 పార్టీలు అన్ని విభేదాలను పక్కనపెట్టి ఒక్కటయ్యాయని ఎంకే స్టాలిన్ చెప్పారు.

MK Stalin: ఎంపీల సంఖ్యతో పాటు రాష్ట్ర హక్కులకు భంగం.. డీలిమిటేషన్‌పై స్టాలిన్

చెన్నై: కేంద్రం చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన (Delimitaion) ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తమిళనాడు ప్రభుత్వం అమీతుమీకి సిద్ధమవుతోంది. దీనిపై చర్చించేందుకు ఈనెల 22న పలు రాష్ట్రాల నాయకులతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఒక వీడియోను ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విడుదల చేశారు. 2026 జనాభా స్థాయి ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైతే పార్లమెంటులో మన ప్రాతినిధ్యం దెబ్బతింటుందని, ఇది కేవలం ఎంపీల సంఖ్య గురించే మాత్రమే కాదని, అన్ని రాష్ట్ర హక్కుల భంగం గురించని స్టాలిన్ అందులో పేర్కొన్నారు. అందువల్లే దీనిపై తాము తొలిసారి గళం వినిపించినట్టు చెప్పారు.

AAP: ఢిల్లీ ఓటమి నేపథ్యం.. ఆప్ కీలక నియామకాలు


''ప్రతిపాదిత డీలిమిటేషన్ అనేది భారతదేశ సమాఖ్య వ్యవస్థ పునాదులను కదిలించేస్తుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి గండికొడుతుంది. ఇది ఉద్దేశపూర్వకంగా కొన్ని రాష్ట్రాలను బలహీనపరిచే ప్రయత్నం. జనాభా వృద్ధిని అరికట్టి జాతీయ ప్రగతికి పాటుపడిన రాష్ట్రాలను దెబ్బతీసే యత్నం'' అని స్టాలిన్ అన్నారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజనను తమిళనాడు ప్రభుత్వం తొలుత వ్యతిరేకించిందని, రాష్ట్రంలోని 58 పార్టీలు అన్ని విభేదాలను పక్కనపెట్టి ఒక్కటయ్యాయని చెప్పారు. ఇది ప్రస్తుతం ఒక జాతీయ ఉద్యమంగా మారిందని అన్నారు. దేశ భవిష్యత్తును రూపొందించే ఉద్యమానికి ఇది నాంది అని అన్నారు.


కాగా, పునర్విభజన అంటూ జరిగితే 1971 జనాభా లెక్కల ప్రకారం జరగాలని డీఎంకే మార్చి 5న చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తీర్మానించింది. అవసరసమైన రాజ్యాంగ సవరణలు చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. పునర్విజన నష్టాలపై చర్చించేందుకు కలిసి రావాలని ఏడు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో 22న చెన్నైలో జరిగే సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇవి కూడా చదవండి

10th Class Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం.. ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు

Judge Corruption: హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు.. అవాక్కైన ఫైర్ సిబ్బంది.. ఏం జరిగిందంటే

Read Latest National News And Telugu News

Updated Date - Mar 21 , 2025 | 03:57 PM