Parliament Session: 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:33 PM
పార్లమెంటు సమావేశాల షెడ్యూల్ ప్రకారం, ఈనెల 31న పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభవుతాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడతారు.

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఖరారయ్యారు. రెండు విడతలుగా జరిగే ఈ సమావేశాల్లో తొలి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరుగుతాయి.
BJP Manifesto: మహిళలకు రూ.2,500 సాయం, గ్యాస్ బండపై రూ.500 సబ్సిడీ
పార్లమెంటు సమావేశాల షెడ్యూల్ ప్రకారం, ఈనెల 31న పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభవుతాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 5న, రవిదాస్ జయంతి నేపథ్యంలో ఫిబ్రవరి 12న పార్లమెంటు కార్యకలాపాలకు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
Kumbh Mela 2025: కుంభమేళాలో ఈ భక్తులకు ఫ్రీ ఫుడ్, వసతి.. వివరాల కోసం కాల్ చేయండి..
Saif Ali Khan: సైఫ్‌పై దాడి.. అదే జరిగితే.. సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు
Read Latest National News and Telugu News