Chennai: హిందీని వ్యతిరేకిస్తూ తమిళనాడు అంతటా పోస్టర్లు..
ABN , Publish Date - Feb 22 , 2025 | 07:57 AM
జాతీయ విద్యావిధానం పేరుతో త్రిభాషా విద్యావిధానాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రయత్నిస్తోందంటూ డీఎంకే(DMK) నాయకులు విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా శుక్రవారం ఉదయం గోడలపై ప్రత్యక్షమైన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.

చెన్నై: జాతీయ విద్యావిధానం పేరుతో త్రిభాషా విద్యావిధానాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రయత్నిస్తోందంటూ డీఎంకే(DMK) నాయకులు విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా శుక్రవారం ఉదయం గోడలపై ప్రత్యక్షమైన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజున పసుపురంగుతో ఉన్న ఓ రైల్వేస్టేషన్ గోడపై ‘తమిళ్ వాళ్‌గ’ (తమిళం వర్థిల్లాలి) అనే నినాదం,
ఈ వార్తను కూడా చదవండి: Birds: కాలికి కడియంతో వస్తున్న వలస పక్షులు..
దాని దిగువనే హిందీ భాషలో ఉన్న ‘హిందీ’ పదాన్ని కొట్టేసినట్లు తారుపూసినట్టు పోస్టరు రూపొందించారు.. ఈ పోస్టర్ 1970లో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Former Chief Minister Karunanidhi) నాయకత్వంలో జరిగిన హిందీ వ్యతిరేకోద్యమంలో రైల్వేస్టేషన్ల(Railway stations)లో ఉన్న హిందీ పేర్లను తారుతో పూసిన సంఘటన తలపించేలా ఉండటం విశేషం. చెన్నై సహా పలు నగరాలలో ఈ పోస్టర్లు అతికించి ఉన్నాయి.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: పర్యాటకానికి అందం
ఈవార్తను కూడా చదవండి: Medak: రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయి
ఈవార్తను కూడా చదవండి: LRS: ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు నిర్ధారణ!
ఈవార్తను కూడా చదవండి: BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు
Read Latest Telangana News and National News