Share News

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

ABN , Publish Date - Apr 04 , 2025 | 11:20 AM

రామేశ్వరం నగరాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ నెల 6వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరం విచ్చేస్తున్న నేపథ్యాన్ని పురష్కరించుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

- ప్రధాని పర్యటన నేపథ్యంలో అడుగడుగునా నిఘా

చెన్నై: రామనాథపురం జిల్లాలోని రామేశ్వరం(Rameshwaram) కేంద్ర బలగాల భద్రతా వలయంలోకి వెళ్ళిపోయింది. క్షేత్రస్థాయి ప్రాంతాలను స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఆధీనంలోకి తీసుకుంది. ఈ నెల 6వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) రామేశ్వరం రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రామేశ్వరం-మండపం ప్రాంతాలను కలుపుతూ సముద్రంలో నిర్మించిన పాంబన్‌ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Rains: అకాల వర్షం.. నగరమంతా చల్లదనం


ఆ తర్వాత రామేశ్వరంలోని రామనాథ స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తరువాత బస్టాండు సమీపంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సుమారు 3 గంటల పాటు ఆయన రామేశ్వరంలోనే గడపన్నారు. ఇందుకోసం స్థానిక పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి భద్రతా విభాగం అధికారులు ముందుగా రామేశ్వరానికి చేరుకుని, ప్రధాని పాల్గొనే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.


nani2.2.jpg

అలాగే, ప్రధాని ప్రయాణించే మార్గాల్లో చేపట్టాల్సిన అదనపు భద్రతపై పోలీస్‌ ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో ఎస్పీ సతీష్‌, జిల్లా రెవెన్యూ అధికారి రాజ్‌ మనోహరన్‌, ప్రజాపనులశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రధాని ప్రత్యేక భద్రతా విభాగం అధికారులు గురువారం అన్ని విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మరోవైపు గురువారం నుంచే రామేశ్వరం ప్రాంతం ప్రధాని భద్రతా విభాగం అధికారుల కనుసన్నుల్లోకి వెళ్ళిపోయింది. రామేశ్వరంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ బస్టాండు వద్ద నిర్మించిన వేదికను బాంబు స్క్వాడ్‌ తనిఖీ చేసింది. ప్రధాని వచ్చి వెళ్ళే రహదారి మార్గంలో సుమారు 20 కిలోమీటర్ల మేర రోడ్డుకిరువైపులా బారికేడ్లను అమర్చారు.


రామేశ్వరం మసీదు మినర్వాపై టార్పాలిన్‌ తొలగింపు

nani2.3.jpg

ప్రధాని పర్యటన సందర్బంగా పాంబన్‌లోని మసీదు మినర్వాను టార్పాలిన్‌తో కప్పివేయడం చర్చకు దారితీసిన నేపథ్యంలో, స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం దానిని తొలగించాలని ఆదేశించింది. కొత్త పాంబన్‌ వంతెన ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో, ఆ ప్రాంతంలోని మసీదు మినర్వాలను టార్పాలిన్‌తో కప్పివేశారని, ఇలాంటి చర్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని స్థానిక ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మినర్వాపై ఉంచిన టార్పాలిన్‌ను తొలగించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్‌!

మా ఆదేశాలు పాటించకపోతే.. సీఎస్‌ జైలుకే!

అకాల వర్షంతో అతలాకుతలం

రెయిన్ అలర్ట్.. మరో రెండు గంటలపాటు..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 04 , 2025 | 11:20 AM