Share News

Delhi Budget: బడ్జెట్‌కు 10 వేల సూచనలు అందాయి: రేఖాగుప్తా

ABN , Publish Date - Mar 22 , 2025 | 07:35 PM

'వికసిత్ ఢిల్లీ బడ్జెట్‌' రూపకల్పన కోసం నిపుణులతో సహా వివిధ వర్గాలను తమ ప్రభుత్వం సంప్రదించిందని, ప్రజల నుంచి ఇ-మెయిల్ ద్వారా 3,300 సూచనలు, వాట్సాప్ ద్వారా 6,982 సూచనలు వచ్చాయని సీఎం రేఖాగుప్తా తెలిపారు.

Delhi Budget: బడ్జెట్‌కు 10 వేల సూచనలు అందాయి: రేఖాగుప్తా

న్యూఢిల్లీ: అసెంబ్లీలో త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు సంబంధించి ప్రజల నుంచి సుమారు 10 వేల సూచనలు అందినట్టు ముఖ్యమంత్రి రేఖాగుప్తా (Rekha Gupta) తెలిపారు. 'వికసిత్ ఢిల్లీ బడ్జెట్‌' రూపకల్పన కోసం నిపుణులతో సహా వివిధ వర్గాలను తమ ప్రభుత్వం సంప్రదించిందని, ప్రజల నుంచి ఇ-మెయిల్ ద్వారా 3,300 సూచనలు, వాట్సాప్ ద్వారా 6,982 సూచనలు వచ్చాయని చెప్పారు. వికసిత్ ఢిల్లీ బడ్జెట్‌కు సమగ్ర రూపం ఇచ్చేందుకు ఈ సమాచారం కీలకం కానుందని తెలిపారు.

Jairam Ramesh: మోదీ ఎప్పుడు వెళ్తారు? అమిత్‌షా ఎందుకు మాట్లాడలేదు?


''ఇది కేవలం ప్రభుత్వ బడ్జెట్ కాదు. ఢిల్లీ ప్రజల బడ్జెట్. ఇందులో ప్రభుత్వ పథకాల్లో ఏ వర్గాలను దూరంగా ఉంచలేదు. మహిళా సాధికారత, నిరంతరాయ విద్యుత్, నీటి సరఫరా, వాయు కాలుష్య నియంత్రణ, యమునా జలాల ప్రక్షాళన, విద్యాప్రమాణాలను మెరుగుపరచడం, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మెరుగుపరచడం సహా కీలక అంశాలన్నింటినీ చేర్చాం'' అని సీఎం వివరించారు.


బడ్జెట్ సమావేశాలు మార్చి 24న 'ఖీర' ఫంక్షన్‌తో ప్రారంభమవుతాయని, 25న బడ్జెట్ సమర్పణ జరుగుతుందని, 28వ తేదీ వరకూ సమావేశాలు జరుగుతాయని సీఎం వివరించారు. 27 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జె్ట్ ఇదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి విజన్‌కు బడ్జెట్ అద్దంపడుతుదని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

JAC Meet Delimitation: డీలిమిటేషన్‌పై హైదరాబాద్‌లో జేఏసీ తదుపరి భేటీ

Chennai: మాజీసీఎం ఘాటు సమాధానం.. మీ పార్టీని తన్నుకుపోతారు

MLA: ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..

Read Latest and National News

Updated Date - Mar 22 , 2025 | 07:36 PM