Anti Corruption Transfers: అవినీతి తగ్గాలంటే ఆఫీసర్లకు బదిలీలు తప్పనిసరి
ABN , Publish Date - Mar 31 , 2025 | 03:33 AM
పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయం ప్రకారం, మంత్రిత్వ శాఖల్లో అధికారులు ఒకే పదవిలో ఎక్కువకాలం పనిచేస్తే అవినీతి పెరిగే అవకాశం ఉంటుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి బదిలీల విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని సూచించడమే కాకుండా, అన్ని బదిలీలు వెంటనే జరగాలని స్పష్టం చేసింది. నిర్దేశిత కాలపరిమితికి మించి అధికారి కొనసాగకూడదని కమిటీ పేర్కొంది

కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సూచనలు
న్యూఢిల్లీ, మార్చి 30: మంత్రిత్వ శాఖల్లో పనిచేసే అధికారులు ఒకే పదవిలో ఎక్కువకాలం కొనసాగితే అవినీతికి ఆస్కారం ఏర్పడుతుందని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. నిర్ణీత కాలపరిమితికి మించి వారు అదే పోస్టులో కొనసాగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అధికారులందరికీ రొటేషన్ విధానం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని మార్చి 27న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నివేదికలో కమిటీ పేర్కొంది. అన్ని బదిలీలు వెంటనే పాలసీ ప్రకారం జరగాలని, ఏ ఒక్క అధికారి కూడా నిర్దేశిత కాలపరిమితికి మించి మంత్రిత్వ శాఖల్లో కొనసాగడానికి వీల్లేదని కమిటీ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
బ్రేకింగ్: ఘోర ప్రమాదం.. స్పాట్‌లో 6 మంది మృతి
UP: నీ ఓపికకు ఓ దండం.. 50వ ఏట 14వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ