Home » Anti Corruption Bureau
యుద్ధం గట్టిగా చేయండి.. సైనికులను, టీమ్ లీడర్లను మాత్రం ఇవ్వం.. అంటే విజయం సంగతి దేవుడికి ఎరుక! అసలు బరిలో దిగడం సాధ్యమేనా? ఇప్పుడు రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పరిస్థితి కూడా ఇదే.
ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి హెచ్చరించారు.
ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే లంచంలో భార్యకు భాగస్వామ్యం ఉంటే ఆమె కూడా శిక్షకు అర్హురాలేనని మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ అభిప్రాయపడింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో భర్తతో పాటు భార్యకు కూడా శిక్ష వేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయడానికి తిరస్కరించింది.
అగ్రిగోల్డ్ స్కామ్ గంటగో మలుపు తిరుగుతోంది. మంగళవారం ఉదయం నుంచి వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన కుమారుడు జోగి రాజీవ్‌ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్కామ్‌లో రాజీవ్ కీలక పాత్ర పోషించారని చెప్పిన ఏసీబీ (AP ACB) అధికారులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు...
ఆ అధికారి పనిచేసేది అవినీతి నిరోధక శాఖలో..! కానీ కంచె చేను మేసినట్లు ఆయనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీలో ఏ అధికారైనా మూడేళ్లు మాత్రమే పనిచేయాలి. కానీ ఆయన ఐదేళ్లుగా అదే సీటులో కొనసాగుతున్నారు. గతంలోనూ నాలుగేళ్లపాటు పనిచేశారు. ఏసీబీ డీఎస్పీ బదిలీ అయిన సందర్భంలో దాదాపు రెండేళ్లపాటు ఇనచార్జి డీఎస్పీగా ఉన్నారు. సీనియర్ సీఐని అంటూ వ్యవహారం నడిపారు. ఇప్పటికి అక్కడ పనిచేయబట్టి ఐదేళ్లయినా బదిలీ కాకుండా చక్రం తిప్పుతున్నారు. తాజాగా డీఎస్పీ బదిలీ కావడంతో మరోసారి ఇనచార్జి కుర్చీ కోసం తహతహలాడుతున్నారు. సంపాదన బాగా మరిగినందుకే ఆయన ‘అవినీతి’ నిరోధక శాఖను వీడటం లేదన్న ...
భారత దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించబోదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అవినీతి వల్ల ప్రజల జీవన నాణ్యత క్షీణిస్తుందని తెలిపారు. అవినీతి ప్రభావం వనరుల వినియోగంపైన ఉంటుందన్నారు. మార్కెట్లను కుదిపేస్తుందని, సేవల బట్వాడాను ప్రభావితం చేస్తుందని తెలిపారు.
తోషాఖానా బహుమతుల కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు జైలు శిక్ష విధించడంపై ఆయన నేతృత్వంలోని రాజకీయ పార్టీ పీటీఐ తీవ్రంగా స్పందించింది. ఈ శిక్ష విధించిన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి హుమయూన్ దిలావర్ పక్షపాతంతో వ్యవహరించారని ఆరోపించింది. పక్షపాతంగల జడ్జి ఇచ్చిన పక్షపాతంతో కూడిన తీర్పును తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు శనివారం గట్టి షాక్ ఇచ్చింది. తోషాఖానా కేసులో ఆయన దోషి అని నిర్థరించి, ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.1,00,000 జరిమానా విధించింది. ఇమ్రాన్‌పై నమోదైన ఆరోపణలు రుజువైనట్లు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి హుమయూన్ దిలావర్ తెలిపారు.