Share News

Sanjay Raut: అస్సలు భయపడడు.. కునాల్ కామ్రాపై సంజయ్ రౌత్

ABN , Publish Date - Mar 26 , 2025 | 06:02 PM

వ్యక్తిగత దాడులకు పాల్పడటం భావ ప్రకటనా స్వేచ్ఛ కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై రౌత్ స్పందిస్తూ, జనం ఏది పడితే అది మాట్లడటం భావ ప్రకటనా స్వేచ్ఛ కాదనే విషయంలో యోగితో తాను ఏకీభవిస్తానని అన్నారు.

Sanjay Raut: అస్సలు భయపడడు.. కునాల్ కామ్రాపై సంజయ్ రౌత్

ముంబై: అనుచిత వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా (Kunal Kamra)కు శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ బాసటగా నిలిచారు. కామ్రా ఎలాంటి బెదిరింపులు భయపడే వ్యక్తికాదని అన్నారు. కామెడీ షోలో ఉప ముఖ్యమంత్రిని ఏక్‌నాథ్ షిండేను ద్రోహిగా కామ్రా పోల్చడంతో పాటు 'దిల్ తో పాగల్ హై' అనే హిందీ పాటలోని చరణాలను మహారాష్ట్ర రాజకీయాలకు అనుగుణంగా పేరడీ చేసి పాడటం వివాదానికి కారణమైంది. దీంతో హాబిటాట్ స్టూడియోపై శివసేన కార్యకర్తలు విరచుకుపడి ధ్వంసానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో తనను చంపుతామంటూ సుమారు 500 బెదిరింపు కాల్స్ వచ్చినట్టు కామ్రా చెబుతున్నారు.

PM Modi: రామనవమికి పంబన్ బ్రిడ్జిని ప్రారంభించనున్న మోదీ


ఆయన లొంగడు..

ఈ వివాదంపై సంజయ్ రౌత్ స్పందిస్తూ.. "కునాల్ కామ్రాను ఎవరు బెదిరిస్తున్నారో నాకు తెలియదు. కామ్రా చాలా ఏళ్లుగా నాకు తెలుసు. ఆయన బెదిరింపులకు భయపడే కళాకారుడు కాదు. ఆయన లొంగిపోయే ప్రసక్తే లేదు. తలవంచడం, భయపడటం కంటే ప్రాణాలివ్వడానికే ఇష్టపడతాడు. బెదిరింపులకు పాల్పడే వారు మాత్రం ఎల్లకాలం బెదిరిస్తూ పోలేరు"అని అన్నారు.


వ్యక్తిగత దాడులకు పాల్పడటం భావ ప్రకటనా స్వేచ్ఛ కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై రౌత్ స్పందిస్తూ, జనం ఏది పడితే అది మాట్లడటం భావ ప్రకటనా స్వేచ్ఛ కాదనే విషయంలో యోగితో తాను ఏకీభవిస్తానని అన్నారు. ''అయినా కామ్రా ఏమన్నారు? ఆయన ఎవరి పేరునూ ప్రస్తావించ లేదు. మహారాష్ట్రలోని పరిస్థితులను హాస్య ధోరణిలో చెప్పారు. నేను కూడా తరచు కుమార్ విశ్వాస్, సురేంద్ర శర్మ కవిత్వాలు చదువుతాను. వాళ్ల రచనల్లోనూ సెటైర్ ఉంటుంది. కామ్రా వ్యాఖ్యల పేరుతో ఆస్తులను ధ్వంసం చేయడం మాత్రం మాత్రం సమర్ధనీయం కాదు" అని సంజయ్ రౌత్ అన్నారు.


కామ్రా వివాదాస్పద వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఆయనను విచారణ అధికారి ముందుకు హాజరుకావాలని ముంబై పోలీసులు మంగళవారం నోటీసులు ఇచ్చారు. అయితే తనకు వారం రోజులుగా ఇవ్వాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. ఆ విజ్ఞప్తిని ముంబై పోలీసులు బుధవారంనాడు తోసిపుచ్చుతూ మరోసారి నోటీసులు ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

Kunal Kamra Joke Row: కునాల్ కామ్రాకు రెండోసారి నోటీసులు.. మరింత గడువుకు నిరాకరణ

Rahool Kanal: కునాల్ కమ్రాకు గుణపాఠం చెబుతామంటూ వార్నింగ్.. ఎవరీ రాహుల్ కనల్?

CM Stalin: కేంద్రం బెదిరించినా ద్విభాషే మా విధానం

Tamilnadu Assembly Polls: ఢిల్లీలో పళనిస్వామి.. బీజేపీతో అన్నాడీఎంకే 'పొత్తు'పొడుపు

Read Latest and National News

Updated Date - Mar 26 , 2025 | 06:09 PM