Home » Sanjay Raut
శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేస్తారని తెలిపారు. అయితే, బీజేపీ నేత ఫడణవీస్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ 2029 వరకు మోదీనే ప్రధాని అని అన్నారు
దేశనాయకత్వాన్ని మార్చాలని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్టు తాను నమ్ముతున్నానని, తన రిటైర్మెంట్ అప్లికేషన్ అందజేయడానికి ప్రధాన మంత్రి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లి ఉండవచ్చని సంజయ్ రౌత్ అన్నారు.
షిండేపై వ్యాఖ్యలకు సంబంధించి కామ్రాపై ఖార్ పోలీసుస్టేషన్‌లో శనివారంనాడు 3 కేసులు నమోదయ్యాయి. జలగావ్ సిటీ మేయర్, నాసిక్‌కు చెందిన ఒక హోటల్ యజమాని, ఒక వ్యాపారి ఈ కేసులు పెట్టారు.
వ్యక్తిగత దాడులకు పాల్పడటం భావ ప్రకటనా స్వేచ్ఛ కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై రౌత్ స్పందిస్తూ, జనం ఏది పడితే అది మాట్లడటం భావ ప్రకటనా స్వేచ్ఛ కాదనే విషయంలో యోగితో తాను ఏకీభవిస్తానని అన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో 10 శాతం సీట్లు లేకున్నా కూడా గతంలో విపక్ష పార్టీలకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లభించిన సందర్భాలు ఉన్నాయని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు.
సంజయ్ రౌత్ రాజ్యసభ సభ్యత్వం ముగియవచ్చిందని, మరోసారి రాజ్యసభకు వెళ్లేందుకు థాకరే సారథ్యంలోని శివసేనకు తగినంత బలం లేదని రాణే తెలిపారు. 288 మంది సభ్యుల అసెంబ్లీలో శివసేన (యూబీటీ)కి కేవలం 20 మంది సభ్యులే ఉన్నట్టు చెప్పారు.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల కారణంగా పార్టీ కార్యకర్తలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదని, ఆ ప్రభావం పార్టీపై, నేరుగా చెప్పాలంటే పార్టీ ఎదుగుదలపై పడిందని రౌత్ అన్నారు.
ముంబైలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండటంతో పార్టీ పరిస్థితిపై చర్చించేందుకు ఇటీవల మాతోశ్రీ నివాసంలో ఠాక్రే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే పార్టీ కార్యకర్తలు, రౌత్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కంటే స్థానిక సంస్థల్లో పోటీకి ఎక్కువ మంది ఆశావహులు ఉన్నారని సంజయ్ రౌత్ చెప్పారు. బీజేపీతో అవిభక్త శివసేన పొత్తు ఉన్నప్పుడు కూడా బీఎంసీ, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో తమ పార్టీ స్వతంత్రంగానే పోటీ చేసిందని గుర్తుచేశారు.
ప్రభుత్వం ఏర్పాటు కోసం పార్టీల మధ్య చిచ్చుపెట్టడం, విడగొట్టడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని సంజయ్ రౌత్ ఆరోపించారు. ప్రస్తుతం బీజేపీ మెజారిటీకి కొన్ని సీట్లు మాత్రమే తక్కువగా ఉన్నందున అధికారం వారి చేతిలో ఉందనే విషయాన్ని తాను అంగీకరిస్తారనని అన్నారు.