Pryagraj Demolitions: ప్రయాగ్‌రాజ్ బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీం ఆగ్రహం.. నష్టపరిహారానికి ఆదేశం
ABN , Publish Date - Apr 01 , 2025 | 04:30 PM
ప్రయాగ్‌రాజ్ ఇళ్ల కూల్చివేతల బాధితుల్లో అడ్వకేట్ జుల్ఫికర్ హైదర్, ప్రొఫెసర్ అలి అహ్మద్, మరి కొందరు ఉన్నారు. కూల్చివేతలకు సంబంధించి వీరు వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు గతంలో తోసిపుచ్చింది. దీంతో వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

న్యూఢిల్లీ: ఇళ్ల కూల్చివేతలపై ఉత్తప్రదేశ్ ప్రభుత్వం, ప్రయాగ్‌రాజ్ అభివృద్ధి సంస్థపై సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారంనాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇళ్ల కూల్చివేత అమానవీయం అని, దేశంలో 'రూల్ ఆఫ్ లా' ఆనేది ఒకటి ఉందని గుర్తుపెట్టుకోవాలని మందలించింది.
Sabarmati Ashram: గాంధీ మునిమనవడి పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం
''ప్రయాగ్‌రాజ్‌లో ఇళ్ల కూల్చివేతలు దిగ్భ్రాంతికరం. బాధితులకు ఆశ్రయం పొందే హక్కు ఉంది. ఈ తరహాలో భవనాలు కూల్చివేయడం ఒక ఫ్యాషన్ కాకూడదు'' అని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బాధితులకు ఆరు వారాల్లోగా రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రయాగ్‌రాజ్ అభివృద్ధి సంస్థను ధర్మాసనం ఆదేశించింది.
ప్రయాగ్‌రాజ్ ఇళ్ల కూల్చివేతల బాధితుల్లో అడ్వకేట్ జుల్ఫికర్ హైదర్, ప్రొఫెసర్ అలి అహ్మద్, మరి కొందరు ఉన్నారు. కూల్చివేతలకు సంబంధించి వీరు వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు గతంలో తోసిపుచ్చింది. దీంతో వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, 2023లో పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌కు చెందిన భూమిగా భావించి అందులోని నివాసాలను రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తగిన లీగల్ ప్రక్రియ పాటించకుండా ప్రయాగ్‌రాజ్‌లో ఇళ్లను కూల్చివేత దిగ్భ్రాంతి కలిగించిదని, ఈ చర్య తప్పుడు సంకేతాలు పంపుతోందని గతంలోనూ సుప్రీంకోర్టు మందలించింది.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బిల్లు.. ఆమోదం పొందుతుందా.. ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే
ఘోర ప్రమాదం.. మంటల్లో కాలి 12 మంది మృతి
మొగలుల పాలనా అంశాల్ని పాఠ్య పుస్తకాల నుంచి ఎందుకు తొలగించారు : సోనియా గాంధీ
For National News And Telugu News