Share News

పనీర్ ప్రియులకు షాక్.. బయటపడ్డ ప్రమాదకర బ్యాక్టీరియా..

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:33 PM

ఈ మధ్య కాలంలో కల్తీ రాయుళ్లు బరితెగించేస్తున్నారు. ప్రజల ప్రాణాల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా కల్తీకి పాల్పడుతున్నారు. వెజ్ తినే వాళ్లు ఎంతో ఇష్టపడే పనీర్‌ను సైతం వదిలిపెట్టడం లేదు.

పనీర్ ప్రియులకు షాక్.. బయటపడ్డ ప్రమాదకర బ్యాక్టీరియా..
Paneer

పాల ఉత్పత్తుల్లో హై డిమాండ్ ఉన్న ఐటమ్ పనీర్ అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం వెజ్ మాత్రమే తినే వాళ్లకు పనీర్‌తో తయారు అయిన ఐటమ్స్ బెస్ట్ ఆప్చన్స్ అవుతున్నాయి. వెజ్ బిర్యానీల్లో కూడా పనీర్ బిర్యానీకి మంచి డిమాండ్ ఉంది. స్వీట్లలో, కర్రీల్లో.. ఇలా చాలా ఐటమ్స్ తయారీలోనూ పనీర్‌ను విరివిరిగా వాడుతుంటారు. కొంతమందికి ప్రతీ రోజూ పనీర్ తినకపోతే.. తిండి తిన్నట్లు అనిపించదు. అలాంటి వారిని షాక్‌కు గురి చేసే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. పనీర్‌లో హాని కలిగించే బ్యాక్టీరియా వెలుగు చూసింది. పనీర్‌ తయారీలో పెద్ద ఎత్తున కల్తీ జరుగుతున్నట్లు బయటపడింది. గత కొద్దిరోజుల నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో చెకింగ్‌కు వెళ్లారు.


వెళ్లిన ప్రతీ చోటా పనీర్ సాంపుల్స్ తీసుకున్నారు. మొత్తం 231 పనీర్ సాంపుల్స్‌ను తీసుకుని ల్యాబ్‌కు టెస్ట్ కోసం పంపారు. ఇందులో 17 సాంపుల్స్‌కు సంబంధించిన రిపోర్టు బయటకు వచ్చింది. ఆ 17 సాంపుల్స్‌లో 2 తినడానికి సురక్షితం కావని తేలింది. వాటిలో హానికరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. మిగిలిన సాంపుల్స్‌కు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కాగా, గత జనవరి నెలలో హైదరాబాద్‌లోనూ పోలీసులు అల్వాల్ పరిధిలోని ఓ గౌడౌన్‌పై దాడులు చేశారు. 600 కేజీల కల్తీ పనీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి కల్తీ పనీర్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కల్తీ పనీర్ తయారు చేస్తున్న విశాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.


కల్తీ పనీర్‌ను గుర్తించటం ఎలా..

కల్తీ పనీర్‌ను గుర్తించడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. మొదటగా పనీర్‌ను చేతుల మధ్య పెట్టి నలపాలి. వేళ్లతో నలిపేసినపుడు అది సులభంగా పిండిలాగా మారితే కల్తీ పనీర్ అని అర్థం. పనీర్ విరిగిపోకుండా గట్టిగా ఉంటే ఒరిజినల్. ఇది కాకుండా మరో మార్గంలో కూడా కల్తీ పనీర్‌ను గుర్తించవచ్చు. పనీర్‌ను వేడి నీటిలో వేసి మరిగించాలి. అది చల్లారాక.. కందిపప్పు పొడి చేసి కొంచెం కలపాలి. కొద్దిసేపటి తర్వాత పనీర్ లేత ఎరుపు రంగులోకి మారినట్లయితే దాన్ని యూరియా, డిటర్జెంట్‌తో కల్తీ చేశారని అర్థం చేసుకోవచ్చు. పనీర్ కొనేముందు దాన్ని గట్టిగా నలిపి చూడటం మంచిది. లేకపోతే కొంచెం పనీర్‌ను నోట్లో వేసుకుని తిని అప్పుడు కొనాలి.


ఇవి కూడా చదవండి:

ఇదేం కాంబినేషన్‌రా నాయనా..

Rahul Gandhi: సభలో నన్ను మాట్లాడనీయడం లేదు: స్పీకర్‌పై రాహుల్ తీవ్ర ఆరోపణ

BIG Hitter in RR: రాజస్థాన్ జట్టులో పరుగుల రాక్షసుడు ఎవరో తెలుసా బ్యాటింగ్‌కు దిగితే ఊచకోతే

Updated Date - Mar 26 , 2025 | 04:39 PM