Share News

Chhattisgarh: మావోయిస్ట్ లీడర్ హీడ్మా టార్గెట్‌గా స్పెషల్ ఆపరేషన్

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:51 AM

ఛత్తీస్‌గడ్‌: మావోయిస్ట్ టాప్ కమాండర్ కేంద్ర కమిటీ సభ్యుడు హీడ్మా టార్గెట్‌గా భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. గత కొన్ని రోజులుగా మెటగూడెం ప్రాంతంలో హిడ్మా కదలికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు కొత్త బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు.

Chhattisgarh: మావోయిస్ట్ లీడర్ హీడ్మా టార్గెట్‌గా స్పెషల్ ఆపరేషన్

ఛత్తీస్‌గడ్‌: మావోయిస్ట్ టాప్ కమాండర్ (Maoist top commander) కేంద్ర కమిటీ సభ్యుడు (Central Committee Member ) హీడ్మా (Heedma) టార్గెట్‌ (Target)గా భద్రతా బలగాలు (Security forces) స్పెషల్ ఆపరేషన్ (Special operation) చేపట్టాయి. సుక్మా జిల్లాలో మావోయిస్ట్ గట్టి పట్టున్న ప్రాంతాల్లో భద్రతా బలగాలు దూకుడుగా గాలింపు చర్యలు చేపట్టాయి. మావోయిస్ట్ బెటాలియన్ కోర్ కమిటీ ఏరియా మెటగూడంలో భద్రతా బలగాలు కొత్త క్యాంపు ప్రారంభించాయి. ఈ క్యాంప్‌ను సీఆర్పీఎఫ్ డీఐజీ, ఎస్పీ సుకుమా ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా మెటగూడెం ప్రాంతంలో మావోయిస్ట్ కమాండర్ హిడ్మా కదలికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. హిడ్మా సొంతూరు బీజాపూర్‌ జిల్లాలోని పూవర్తిని ఇప్పటికే అధీనంలోకి సీఆర్‌పీఎఫ్‌ క్యాంపును ఏర్పాటు చేశాయి. సుమారు 5వేల మంది కేంద్ర బలగాలు పూవర్తి అడవులను జల్లెడ పడుతున్నాయి. కాగా గత నెల డిసెంబర్ 15న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. జగదల్‌పూర్‌లో నక్సల్ బాధిత కుటుంబాలతో సమావేశం అయ్యారు. తర్వాత భద్రతా బలగాలతో అమిత్ షా సమావేశమై యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చర్యలపై సమీక్షించారు.


ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రభావం...

మరోవైపు దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా 2026, మార్చిలో నెలలోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వయం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో.. మావోయిస్టులను నిర్మూలించారు. జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వం వరుసగా చర్యలు చేపడుతోంది. కానీ ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రభావం కొద్దిగా ఉంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీంతో ఇటీవల కాలంలో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో వరుస ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. దాంతో మావోయిస్టులకు వరుస దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇంకోవైపు మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్రప్రభుత్వం ఇప్పటికే పిలుపు ఇచ్చింది. జన జీవన స్రవంతిలో కలిసి.. దేశ నిర్మాణంలో భాగస్యామ్యం కావాలని మావోయిస్టులను రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సూచించాయి.


దేశంలో మావోయిజాన్ని నిర్మూలించేలా చర్యలు..

ఆయుధాలు వీడి లొంగిపోవాలని మావోయిస్టులకు అమిత్ షా పిలుపు నిచ్చారు. లేకుంటే వారిని సమూలంగా నిర్మిలిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ప్రకటన చేసిన పక్షం రోజుల్లోనే ఛత్తీస్‌గఢ్‌లో ఈ భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం. సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలోని తన నివాసంలో ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు బాధిత కుటుంబాలతో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలో మావోయిజాన్ని నిర్మూలించి.. శాంతి సుస్థిరతలు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారని తెలిపారు. అందులో భాగంగా నేపాల్‌లోని పశుపతి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వరకు మావోయిస్టులు కారిడార్ ఏర్పాటు చేసేందుకు జరిగిన ప్రయత్నాలను ప్రధాని మోదీ ధ్వంసం చేశారని అమిత్ షా గుర్తు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాణిపాకంలో భక్తుల కోసం అధికారుల వినూత్న ప్రయోగం

విదేశీ ప్రయాణికులపై ఐటీ ఫోకస్

కాణిపాక వినాయక ఆలయానికి పోటెత్తిన భక్తులు

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు

న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 01 , 2025 | 11:51 AM