Share News

Special Pass: శబరిమలలో.. స్పెషల్‌ పాస్‌ల రద్దు!

ABN , Publish Date - Jan 02 , 2025 | 05:33 AM

ఎరుమేళి నుంచి అటవీ మార్గంలో అలుదానది, కరిమల కొండ మీదుగా(పెద్దపాదం) శబరిమలకు వచ్చే భక్తులకు ఇస్తున్న స్పెషల్‌ పాస్‌లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు(టీడీబీ) ప్రకటించింది.

Special Pass: శబరిమలలో.. స్పెషల్‌ పాస్‌ల రద్దు!

శబరిమల, జనవరి 1: ఎరుమేళి నుంచి అటవీ మార్గంలో అలుదానది, కరిమల కొండ మీదుగా(పెద్దపాదం) శబరిమలకు వచ్చే భక్తులకు ఇస్తున్న స్పెషల్‌ పాస్‌లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు(టీడీబీ) ప్రకటించింది. గత నెల 30 నుంచి ప్రారంభమైన మకరవిళక్కు సీజన్‌కు అంచనాలకు మించి, ఐదు రెట్లు అధికంగా స్వాములు వస్తున్నారని, దీంతో.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పాసుల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - Jan 02 , 2025 | 05:33 AM