Share News

Supreme Court: ‘గాలి’ కేసులో 4 నెలల తుది గడువు

ABN , Publish Date - Jan 11 , 2025 | 03:43 AM

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డిపై 2011లో నమోదైన అక్రమ మైనింగ్‌ కేసులో విచారణను ముగించేందుకు ట్రయల్‌ కోర్టుకు సుప్రీంకోర్టు తుది గడువు ఇచ్చింది. 4 నెలల్లో విచారణ పూర్తి చేయాలని..

Supreme Court: ‘గాలి’ కేసులో 4 నెలల తుది గడువు

న్యూఢిల్లీ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డిపై 2011లో నమోదైన అక్రమ మైనింగ్‌ కేసులో విచారణను ముగించేందుకు ట్రయల్‌ కోర్టుకు సుప్రీంకోర్టు తుది గడువు ఇచ్చింది. 4 నెలల్లో విచారణ పూర్తి చేయాలని.. ఇదే చివరి అవకాశమని.. ఇక గడువు పొడిగించేది లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.

Updated Date - Jan 11 , 2025 | 03:43 AM