Share News

Gujarat Helicopter Crash: కూలిన హెలికాఫ్టర్.. ఎంతమంది చనిపోయారంటే

ABN , Publish Date - Jan 05 , 2025 | 03:18 PM

పోర్‌బందర్ ఎయిర్ పోర్టులో హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుండగా ప్రమాదం జరిగినట్టు ఐసీజీ అధికారులు తెలిపారు. హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం ముగ్గురు ఉన్నారని, ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారని పోర్‌బందర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భగీరథ్ సింగ్ జజేజా తెలిపారు.

Gujarat Helicopter Crash: కూలిన హెలికాఫ్టర్.. ఎంతమంది చనిపోయారంటే

పోర్‌బందర్: గుజరాత్ (Gujarat)లోని పోర్‌బందర్‌ (Porbandar)లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కుప్పకూలడంతో అందులోని ముగ్గురు సిబ్బంది మృతి చెందారు. రోజువారి శిక్షణలో ఉండగా కోస్ట్ గార్డ్ ఎయిర్ ఎన్‌క్లేవ్‌లో ఆదివారంనాడు మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్ కుప్పకూలింది.

PM Modi: బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి


పోర్‌బందర్ ఎయిర్ పోర్టులో హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుండగా ప్రమాదం జరిగినట్టు ఐసీజీ అధికారులు తెలిపారు. హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం ముగ్గురు ఉన్నారని, ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారని పోర్‌బందర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భగీరథ్ సింగ్ జజేజా తెలిపారు. ఐసీజీ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్)లో ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు చెప్పారు.


కాగా, హెలికాప్టర్‌‌లో తీవ్రంగా కాలిపోయిన సిబ్బందిని బయకు తీసి హుటాహుటిన పోర్‌బందర్‌లోని ఆసుపత్రికి తరలించామని, చికిత్స పొందుతూ వారు కన్నుమూశారని కమలాబాగ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ కన్మియ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

Maha Kumbh Mela 2025: ఈ జాతర కోసం 13,000 రైళ్లు.. ఈసారి 40 కోట్ల మంది వస్తారని..

Chatthisghar: నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఎంతమంది మావోలు మృతంటే..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 05 , 2025 | 03:30 PM