Share News

S Jaishankar: వాణిజ్య ఒప్పందాలు వాస్తవం, భారత్‌ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:42 PM

అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు చాలా కీలకమని, అయితే ఇందువల్ల ఒనగూరే ప్రయోజనాలను చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలని ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ అన్నారు.

S Jaishankar: వాణిజ్య ఒప్పందాలు వాస్తవం, భారత్‌ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలపై ఓవైపు చర్చ జరుగుతుండటం, ప్రతీకార వాణిజ్య సుంకాలకు అగ్రరాజ్యం అమెరికా గడువు విధించిన నేపథ్యంలో వాణిజ్య ఒప్పందాలు వాస్తవమని, అయితే భారత్ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం అనే విధానాన్ని తాము అనుసరించనున్నామని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు చాలా కీలకమని, అయితే ఇందువల్ల ఒనగూరే ప్రయోజనాలను చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలని ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ అన్నారు. ప్రధానంగా సున్నితమైన టెక్నాలజీ విషయంలో ఇలాంటి ఒప్పందాల వల్ల ఇరువైపులా ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు.

Delhi High Court Judge: నోట్ల కట్టల ఆరోపణలు నిరాధారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ


భారత ప్రభుత్వం ప్రస్తుతం మూడు కీలక వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు జరుపుతోందని జైశంకర్ తెలిపారు. వీటిలో ఒకటి యూఎస్‌తో జరురుతోందని చెప్పారు. "అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు కీలకం. ఇప్పుడు వీటి ప్రాధాన్యత కూడా పెరిగింది. దీనిని భారత్ గుర్తించింది. ప్రస్తుతం, మనం మూడు వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు జరుపుతున్నాం. ఐరోపా సమాఖ్య, యూకే, అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందంతో చర్చలు జరుపుతున్నాం. న్యూజిలాండ్‌తో కూడా ఈ వారమే చర్చలు ప్రారంభించాం. మరి కొందరితో కూడా చర్చలు జరపనున్నాం'' అని జైశంకర్ తెలిపారు.


భారతదేశం ''ఇండియా ఫస్ట్'' విధానాన్ని అనుసరించనుందని జైశంకర్ భరోసా ఇచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ఇండియా ఫస్ట్ పాలసీని అనుసరించనున్నట్టు చెప్పారు. గతంలో ఎక్కువగా ఆసియా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ)లు చేసుకునే వాళ్లమని, వాణిజ్యం పోటాపోటీగా ఉండేదని అన్నారు. అమెరికా ఫస్ట్ పాలసీలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రతీకార సుంకాలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. భారత్‌తో మంచి సంబంధాలే ఉన్నాయని, అయితే భారత్ అధిక సుంకాలు విధిస్తోందని, ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు తప్పవని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

Karnataka: ఘోర ప్రమాదం.. భారీ రథాలు కూలిపోయి.. బాబోయ్..

Navy Employee Case: నాకు ఫుడ్ వద్దు.. డ్రగ్స్ కావాలి.. నిందితురాలి కొత్త డిమాండ్

Read Latest and National News

Updated Date - Mar 23 , 2025 | 04:44 PM