Pahalgam Terror Attack: జమ్మూకశ్మీర్ డీజీపీకి ఫోన్ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్..
ABN , Publish Date - Apr 23 , 2025 | 09:31 PM
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్ డీజీపీ నళిని ప్రభాత్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. రాష్ట్రంలో పర్యాటకుల భద్రతపై ఆరా తీశారు. పర్యాటకులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని డీజీపీని ఆయన ఆదేశించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. రాష్ట్రంలో పర్యాటకుల భద్రతపై ఆరా తీశారు. పర్యాటకులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని డీజీపీని ఆయన ఆదేశించారు. కాగా, టూరిస్టుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు. టూరిస్టులెవరూ ఆందోళనలకు గురికావొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. జమ్మూకశ్మీర్‌లోని హోటళ్ల యజమానులతోనూ బండి సంజయ్ ఫోన్‌లో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని కుకటి వేళ్లతో పెకలించి వేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వెల్లడించారు. మరోవైపు.. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయం నుండి బండి సంజయ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.