Perfect Fit Jumpsuits: జంప్‌సూట్స్ జోరు
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:13 AM
జంప్‌సూట్స్ అన్ని వయసుల వారికీ అనువైన ప్రత్యేకమైన దుస్తులు. ఈ దుస్తులు వేడుకలకు, casual outingsకు perfect choice. శరీరాకృతికి అనుగుణంగా సరికొత్త స్టైల్స్‌ని ఎంచుకుని, లైట్‌గా ఉండే శ్రమతో ఆకర్షణీయంగా కనిపించవచ్చు.

ఫ్యాషన్
అన్నిసార్లూ తీరికగా సింగారించుకునే సమయం ఉండదు. ఒక్కోసారి క్షణాల్లో తయారు కావల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఆకర్షణీయంగా కనిపించాలనుకుంటే, నిస్సందేహంగా జంప్‌సూట్స్‌ను ఎంచుకోవచ్చు. ఈ వినూత్న డ్రస్సుల మీద ఓ లుక్కేద్దామా?
ఈ డ్రస్‌లు అన్ని వయసుల వారికీ నప్పుతాయి. వైవిద్యంగా, విభిన్నంగా కనిపించాలనుకుంటే, మరో ఆలోచన లేకుండా జంప్‌సూట్స్‌ను ఎంచుకోవాలి. అన్ని సందర్భాలకూ, వేడుకలకూ నప్పే ఈ దుస్తులు భారీ హంగులతో కూడా రూపొందుతున్నాయి. ఫ్యూజన్ లుక్‌తో కనిపించేలా పట్టుతో కూడా తయారవుతున్నాయి. శాటిన్, సింథటిక్, కాటన్...ఇలా పలు రకాల వస్త్రాల్లో దొరుకుతున్నాయి.
సొబగులు జోడించి...
జంప్‌సూట్‌లో సంప్రదాయబద్ధంగా కనిపించాల నుకుంటే ఆక్సిడైజ్డ్ ఝుంకాలు, చాంద్‌బాలీలు పెట్టుకోవాలి. మెరుపులీనే నెక్లెస్, జుత్తీలు, కోల్హాపురి చెప్పులతో మ్యాచ్ చేయాలి. ఆఽధునికంగా కనిపించాలనుకుంటే స్లింగ్ బ్యాగ్, హైహీల్స్ ధరించాలి. స్లీవ్‌లెస్ జంప్‌సూట్ వేసవి సెలవుల విహారాలకు అనువుగా ఉంటాయి. ఎక్కువ వదులుగా ఉండే కాటన్ జంప్‌సూట్స్ స్నేహితులతో కాలక్షేపం చేసే సాయంకాలపు విహారాలకు అనువుగా ఉంటాయి.
శరీరాకృతికి తగ్గట్టు...
పియర్ షేప్ ఉన్నవారు వెడల్పాటి కాళ్లతో కూడిన జంప్‌సూట్ ఎంచుకోవాలి. యాపిల్ శరీరాకృతి కలిగిన వాళ్లు సన్నని నడుమును హైలైట్ చేయడం కోసం ఒంటికి హత్తుకునే జంప్‌సూట్ వేసుకోవాలి. ఆకర్షణీయమైన శరీరాకృతి కలిగిన వాళ్లు ర్యాప్ జంప్‌సూట్ వేసుకోవచ్చు. ఇక అవర్‌గ్లాస్ శరీరాకృతి కలిగిన వాళ్లు బెల్టెడ్ జంప్‌సూట్ ఎంచుకోవాలి. మిక్సింగ్, మ్యాచింగ్ ఇబ్బంది లేదు కాబట్టి నచ్చిన జంప్‌సూట్స్‌ను అందుబాటులో ఉంచుకుంటే, చటుక్కున అందుకుని క్షణాల్లో సిద్ధమైపోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Bad Luck to Shreyas Iyer: అయ్యర్‌కు అదృష్టాన్ని దూరం చేసిన శశాంక్.. ఏడుపొక్కటే తక్కువ
IPL 2025: నువ్వు మారవా..ఐపీఎల్ వదిలేసి పల్లీ బఠాణీలు అమ్ముకో, స్టార్ ఆటగాడిపై ట్రోల్స్..
IPL 2025: పంజాబ్ సూపర్ కింగ్స్‌లో పవర్‌ఫుల్ హిట్టర్ల లిస్ట్ చుశారా..
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News