Window Shelf Warnings: కిటికీల దగ్గర వీటిని ఉంచవద్దు
ABN , Publish Date - Mar 26 , 2025 | 02:05 AM
కిటికీ అర వద్ద కొన్ని వస్తువులు ఉంచకూడదు. డియోడరెంట్లు, స్ర్పేలు, అద్దాలు, దుస్తులు, మొక్కల కుండీలు వంటి వాటి వల్ల ఇంట్లో గాలి, వెలుతురు సరైన రీతిలో ప్రసరించదు మరియు ప్రమాదాల కారణం అవవచ్చు. వేడి, సూర్యరశ్మి వల్ల కొన్ని వస్తువులు పాడవుతాయి.

ఇంట్లో కిటికీల కింద అమర్చే చిన్న అరల మీద రకరకాల వస్తువులు పెడతాం. అయితే కిటీకీల దగ్గర కొన్ని రకాల వస్తువులు ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు.
కిటికీల దగ్గర డియోడరెంట్, పర్‌ఫ్యూమ్, స్ర్పే లాంటివి పెట్టకూడదు. అలా పెడితే బయటి నుంచి వచ్చే సూర్యరశ్మి వీటిపై పడి అవి ప్రభావితమవుతాయి. ఒక్కోసారి అవి పేలవచ్చు కూడా.
అద్దాల తలుపులు ఉన్న కిటికీల దగ్గర దుప్పట్లు, దుస్తులు ఉంచవద్దు. అద్దం మీద సూర్యరశ్మి పడినప్పుడు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంటుంది.
కిటికీ అరను వస్తువులతో నింపితే ఇంట్లోకి గాలి, వెలుతురు సరిగా ప్రసరించవు. అంతేకాకుండా బయటి నుంచి వచ్చే దుమ్ము, వాన నీటి వల్ల వస్తువులు పాడవుతాయి.
కిటికీ అర మీద పెద్దవాళ్లు వేసుకునే మందు బిళ్లల షీట్లు, చిన్న పిల్లలు తాగే సిరప్ సీసాలను ఉంచకూడదు. బయటి నుంచి వచ్చే వేడి వల్ల అవి పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి.
కొంతమంది కిటికీ అరను మొక్కలు పెంచే కుండీలతో నింపేస్తూ ఉంటారు. దీనివల్ల కిటికీని తరచూ శుభ్రం చేయడం వీలు కాకపోవచ్చు. కిటికీ మొత్తం దుమ్ము, ధూళితో నిండడంతో అపరిశుభ్రమైన గాలి ఇంట్లోకి వచ్చి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.
వేసవికాలంలో కిటికీ అర మీద కొవ్వొత్తులు, లాంతర్లు లాంటి వాటిని పెట్టకూడదు.
ఇవి కూడా చదవండి..
Dhanashree-Ritika: ఛాహల్ మాజీ భార్యపై జర్నలిస్ట్ విమర్శ.. లైక్ కొట్టిన రోహిత్ భార్య రితిక
Vignesh puthur: విఘ్నేష్ పుత్తుర్.. ఆటో డ్రైవర్ కొడుకుతో ధోనీ ఏం మాట్లాడాడంటే..