Dark Skin is Power: నలుపును ఎందుకు అవమానించాలి
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:10 AM
శారదా మురళీధరన్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో నలుపు రంగుపై ఉన్న వివక్షను ఖండించారు. ఆమె నలుపును గర్వంగా అంగీకరించి, అది శక్తివంతమైన రంగుగా అభిప్రాయపడతారు. సమాజం నలుపును తప్పుగా చూడటం తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు

నలుపు రంగు పట్ల మన సమాజంలో ఉన్న వివక్ష ఈనాటిది కాదు. మన జీవితాలలోని అనేక పార్శ్వాలలో ఇది బయటపడుతూనే ఉంటుంది. ముఖ్యంగా నల్లగా ఉన్న మహిళల పట్ల అవాంఛనీయమైన వ్యాఖ్యలు వింటూనే ఉంటాం. తాజాగా కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. నల్లగా ఉన్నందుకు తనను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు. ఆ పోస్టుకు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మద్దతు తెలియజేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఆ పోస్టులో ఏముంది..?
‘‘నేను నల్లగా ఉండటంవల్ల చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేకపోతున్నానని నిన్న ఒకరు వ్యాఖ్యానించారు. నాకన్నా ముందు ఈ బాధ్యతలు నిర్వహించిన నా భర్తతో (వేణు) పోలిస్తే నా పనితీరు పేలవంగా ఉందన్నారు. ఎందుకంటే నా భర్త తెల్లగా ఉంటారు. నేను నల్లగా ఉన్నందుకట. ఈ నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలివి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను నల్లగా ఉంటానని చెప్పటానికి నాకు ఎటువంటి సంకోచం లేదు. నేను ఈ పోస్ట్‌ను ఈ రోజు ఉదయం ఫేస్‌బుక్‌లో పెట్టా. ఆ పోస్ట్‌కు విపరీతమైన స్పందనలు రావటం మొదలుపెట్టాయి. నేను చేసింది సరైన పనేనా అనే సందేహం కలిగింది. దాంతో వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించా. ఆ తర్వాత కొంత మంది సన్నిహితులు ఈ విషయంపై చర్చ జరిగితే బాగుంటుందని సూచించారు. వారితో నేను ఏకీభవిస్తున్నా. అందుకే దీనిని మళ్లీ పోస్ట్ చేస్తున్నా.
ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పాలను కున్నాననే ప్రశ్న చాలా మందిలో తలెత్తవచ్చు. నా నలుపు రంగుపై చేసిన వ్యాఖ్యలు నాకు బాధ కలిగించాయి. నేను పదవిలోకి వచ్చి ఏడు నెలలు అయింది. ఈ ఏడు నెలలు నాకన్నా ముందు పదవిలో ఉన్న వ్యక్తి రంగుతో నన్ను పోలుస్తూనే ఉన్నారు. నేను సహిస్తూనే వచ్చాను. కానీ నా చర్మపు రంగు ఆధారంగా నేను సిగ్గుపడాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలను మాత్రం సహించలేకపోతున్నా. ఈ తరహా వ్యాఖ్యలు చేసేవారు నలుపును ఒక రంగుగా చూడటంలేదు. వారి దృష్టిలో... నలుపు ఎప్పుడూ మంచి చేయదు. నలుపు ఒక రుగ్మత. నలుపు నిరంకుశధోరణికి చిహ్నం. నలుపు చీకటికి సంకేతం. కానీ నలుపును ఎందుకు తప్పుగా భావించాలి? నలుపు మన విశ్వపు రంగు. నలుపు దేనినైనా తనలో కలిపేసుకోగలదు. మానవాళికి తెలిసిన అత్యంత శక్తిమంతమైన శక్తి నలుపే! ఈ రంగు అందరికీ సమానంగా పనికొస్తుంది. అనేక ఆఫీసులలో డ్రెస్ కోడ్ రంగు అది. సాయంత్రం పార్టీ డ్రెస్ కోడ్ అది. కళ్లకు పెట్టుకొనే కాటుక రంగు అది. వాన వస్తుందనే ఆశకు చిహ్నం అది.
నాకు నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడు మా అమ్మను అడిగాను... ‘‘నన్ను మళ్లీ నీ కడుపులో పెట్టి తెల్లగా, అందంగా బయటకు తీసుకువస్తావా’ అని! గత 50 ఏళ్లుగా నలుపు మంచిది కాదు అనే బలమైన భావన వింటూ పెరిగాను. దానిని నమ్మాను. తెల్లటి చర్మం ఉంటే మంచి ఆలోచనలు ఉంటాయని... వారు మంచివారని... గొప్పవారనే భావన నాలో కూడా ఉండేది. నేను తెల్లగా ఉన్నవారి కన్నా తక్కువ కాబట్టి... ఆ లోపాన్ని పూరించుకోవటానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలు నాలో కలిగేవి.
నాకు పిల్లలు పుట్టి... వారు పెద్దవారయ్యే దాకా ఇదే భావనలో ఉన్నా. కానీ నా పిల్లలు తాము నల్లగా ఉన్నందుకు గర్వపడతారు. అందంగా ఉన్నామని భావిస్తారు. వారి దృష్టి కోణం నుంచి చూసినప్పుడు నాకు కూడా నలుపు అందంగా కనబడటం మొదలుపెట్టింది. ఇప్పుడు నాకు నలుపు ఒక బ్రహ్మాండమైన రంగు. నలుపు వెనకున్న గొప్పతనాన్ని నేను అర్థం చేసుకున్నా!
విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసేవారు నలుపును ఒక రంగుగా చూడటంలేదు. వారి దృష్టిలో... నలుపు ఎప్పుడూ మంచి చేయదు. నలుపు ఒక రుగ్మత. నలుపు నిరంకుశధోరణికి చిహ్నం. నలుపు చీకటికి సంకేతం. కానీ నలుపును ఎందుకు తప్పుగా భావించాలి?
నేను పదవిలోకి వచ్చి ఏడు నెలలు అయింది. ఈ ఏడు నెలలు నాకన్నా ముందు పదవిలో ఉన్న వ్యక్తి రంగుతో నన్ను పోలుస్తూనే ఉన్నారు. నేను సహిస్తూనే వచ్చాను. కానీ నా చర్మపు రంగు ఆధారంగా నేను సిగ్గుపడాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలను మాత్రం సహించలేకపోతున్నా.
ఇవి కూడా చదవండి:
Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Read More Business News and Latest Telugu News