Share News

TASA: టాసా వెబ్‌సైట్‌ ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ABN , Publish Date - Jan 15 , 2025 | 09:44 PM

రియాద్ తెలుగు ప్రవాసీ సంఘం(టాసా) అధికారిక వెబ్‌సైట్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సౌదీ అరేబియా రియాద్ నగరంలోని తెలుగు ప్రవాసీయుల సంఘమైన తెలుగు అసోసియెషన్ ఆఫ్ సౌదీ అరేబియా..

TASA: టాసా వెబ్‌సైట్‌ ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
Kishan Reddy Launches TASA Website

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): రియాద్ తెలుగు ప్రవాసీ సంఘం(టాసా) అధికారిక వెబ్‌సైట్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సౌదీ అరేబియా రియాద్ నగరంలోని తెలుగు ప్రవాసీయుల సంఘమైన తెలుగు అసోసియెషన్ ఆఫ్ సౌదీ అరేబియా (టాసా) అంతర్జాలంలో అడుగిడిగింది. టాసా అధికారిక వెబ్ సైట్ www.tasaksa.org ను కేంద్ర బొగ్గు, గనుల మంత్రి జి. కిషన్ రెడ్డి బుధవారం రాత్రి రియాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టాసా అధ్యక్షుడు స్వర్ణ స్వామి సంస్థ కార్యకలాపాలను మంత్రికి వివరించారు. ఇదిలాఉంటే.. జనవరి 17వ తేదీన అంటే శుక్రవారం నాడు సంక్రాంతి సంబరాలు నిర్వహించడంతో పాటు.. క్రికెట్ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు స్వామి తెలిపారు.

Updated Date - Jan 15 , 2025 | 09:44 PM