ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆలపాటి రాజేంద్రప్రసాద్ నామినేషన్... పాల్గొన్న మన్నవ మోహన కృష్ణ
ABN, Publish Date - Feb 07 , 2025 | 07:59 PM
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం కొనసాగుతోంది. అందులోభాగంగా కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఆ క్రమంలో గుంటూరు మహానగరంలోని స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆలపాటి రాజా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణతోపాటు ఇరు జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‍తో మన్నవ మోహనకృష్ణ, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు

ర్యాలీలో పాల్గొన్న మన్నవ మోహనకృష్ణతోపాటు నక్క ఆనందబాబు తదితరులు

ర్యాలీలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్

స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు

జిల్లా కలెక్టర్ కార్యాయలం వద్ద విలేకర్లతో మాట్లాడుతోన్న మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతోపాటు మన్నవ మోహనకృష్ణ

జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడుతోన్న మాజీ మంత్రి నెట్టం రఘురాంతోపాటు మన్నవ మోహనకృష్ణ

నామినేషన్ వేసిన అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో మన్నవ మోహన కృష్ణ
Updated at - Feb 07 , 2025 | 08:01 PM