Black Cumin Seeds : నల్ల జీలకర్ర తింటే ఇన్ని వ్యాధులు తగ్గిపోతాయా..
ABN, Publish Date - Mar 18 , 2025 | 07:18 PM
Black Cumin Seeds Health Benefits : నల్ల జీలకర్ర రోజూవారి వంటకాల్లో తక్కువగా వాడుతుంటారు. అయితే, దీన్ని రోజూ ఆహారంలో తీసుకుంటే ఎన్ని వ్యాధులు తగ్గిపోతాయో మీరు ఊహించలేరు.

నల్ల జీలకర్ర రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనం కలుగుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు అనే వ్యాధులను నియంత్రిస్తుంది.

నల్ల జీలకర్రను రోజూ ఓ చెంచాడు తిన్నారంటే మీ చర్మం నిగనిగలాడుతుంది. అలాగే జుట్టు కూడా చక్కగా పెరుగుతుంది.

ఈ గింజల్లో ఐరన్, సోడియం, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. దీనిని తేనెతో కలిపి తింటే ఎన్నో లాభాలు.

నల్ల జీలకర్రకు డయాబెటిస్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులను నిరోధించే శక్తి ఉంది. క్యాన్సర్‌నూ నివారించగలదని వైద్యులు చెబుతున్నారు.

గోరువెచ్చని నీటిలో నల్లజీలకర్రను తేనెతో కలిపి తాగితే ఆస్తమా నుంచి మీకు తక్షణమే ఉపశమనం దక్కుతుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తింటే ఇంకా మంచిది.
Updated at - Mar 18 , 2025 | 07:32 PM